తప్పిన పెనుప్రమాదం
ABN , Publish Date - Oct 27 , 2026 | 01:59 AM
శ్రీకాళహస్తి మండలం ఎర్రమరెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సోమవారం ఉదయం పెనుప్రమాదం నుంచీ తప్పించుకున్నారు.
శ్రీకాళహస్తి రూరల్, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి మండలం ఎర్రమరెడ్డిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సోమవారం ఉదయం పెనుప్రమాదం నుంచీ తప్పించుకున్నారు.14మంది విద్యార్థులతో ప్రధానోపాధ్యాయుడు నరేష్ పాఠశాల ఎదుట ప్రార్థన చేయిస్తుండగా పెద్దశబ్దం విన్పించింది.లోపలకు వెళ్లి చూడగా తరగతి గది పైకప్పు నుంచి పెద్ద పెచ్చులు ఊడి కిందపడి వున్నాయి. గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రం లేకపోవడంతో మరో ఐదుగురు చిన్నారులు కూడా ఆ సమయంలో పాఠశాలలోనే ఉన్నారు.ఈ విషయం తెలిసి పాఠశాల వద్దకు చేరుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు స్కూలు భవనం శిథిలావస్థకు చేరినా ఎవరూ పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈవో బాలయ్య, ఏఎంవో చంద్రశేఖర్, ఏపీవో సుధాకర నాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఎక్స్‌కవేటర్ సాయంతో శిథిలాలను తొలగించారు.