Share News

రోడ్డుపై ఒంటరి ఏనుగు హల్‌చల్‌

ABN , Publish Date - Apr 15 , 2026 | 02:04 AM

చంద్రగిరి మండలం భీమవరం అడవిలోని ఎ.రంగంపేట, కొత్తపేట రోడ్డు మార్గంలో మంగళవారం ఒంటరి ఏనుగు హల్‌చల్‌ చేసింది.గంట పాటు వాహన రాకపోకలు నిలిచిపోయాయి.

రోడ్డుపై ఒంటరి ఏనుగు హల్‌చల్‌
రోడ్డుపై సంచరిస్తున్న ఒంటరి ఏనుగును చూసి నిలిచిపోయిన వాహనాలు

గంట పాటు నిలిచిపోయిన వాహన రాకపోకలు

చంద్రగిరి, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): చంద్రగిరి మండలం భీమవరం అడవిలోని ఎ.రంగంపేట, కొత్తపేట రోడ్డు మార్గంలో మంగళవారం ఒంటరి ఏనుగు హల్‌చల్‌ చేసింది.గంట పాటు వాహన రాకపోకలు నిలిచిపోయాయి.ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఎ.రంగంపేట, కొత్తపేట రోడ్డు మార్గంలో భీమవరం అడవి సమీపంలో రోడ్డుపై ఒంటరి ఏనుగు సంచరిస్తుండగా ఆ దారిలో వెళ్ళే ప్రయాణికులు చూసి భయాందోళనకు గురయ్యారు. రోడ్డుపైనే ఒంటరి ఏనుగు గంట పాటు ఉండటంతో ఇరు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. బాణా సంచా కాల్చి ఏనుగును అడవిలోకి తరలించాక వాహన రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి.

Updated Date - Apr 15 , 2026 | 02:04 AM