కిలో టమోటా రూ.41
ABN , Publish Date - Jun 08 , 2026 | 12:49 AM
మదనపల్లె మార్కెట్‌లో నెల రోజులుగా కిలో రూ.25 నుంచి రూ.33 మధ్య ఊగిసలాడుతున్న టమోట ధరలు ఆదివారానికి రూ.41కి చేరుకుంది. ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి ఇదే గరిష్ట ధరగా నమోదైంది.
మదనపల్లె టౌన్, జూన్ 7(ఆంధ్రజ్యోతి): మదనపల్లె మార్కెట్‌లో నెల రోజులుగా కిలో రూ.25 నుంచి రూ.33 మధ్య ఊగిసలాడుతున్న టమోట ధరలు ఆదివారానికి రూ.41కి చేరుకుంది. ఈ ఏడాది సీజన్ ప్రారంభం నుంచి ఇదే గరిష్ట ధరగా నమోదైంది. మదనపల్లె మార్కెట్‌కు నెల రోజులుగా నిత్యం 700 నుంచి 800 మెట్రిక్ టన్నుల టమోట విక్రయానికి వస్తుండగా నాలుగు రోజులుగా తగ్గింది. కానీ ఆదివారం ఏకంగా 990 టన్నులు వచ్చాయి. ఇంత పెద్దమొత్తంలో వస్తే సాధారణంగా ధరలు తగ్గుతాయి. కానీ నాణ్యత బాగుండటం, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లో సీజన్ ముగిసే దశ కావడం, తమిళనాడు, కోస్తాంధ్ర ప్రాంత వ్యాపారులు కొనుగోలుకు రావడంతో ధరలు పెరిగాయి. మొదటి రకం గరిష్టంగా కిలో రూ.41 పలుకగా, రెండో రకం కనిష్టంగా రూ.23 పలికింది. ఈ ఏడాది జూన్, జూలై నెలల్లో మార్కెట్‌కు 2వేల టన్నుల టమోట వస్తుందని వ్యాపారులు అంచనా వేస్తుండగా, నైరుతి రుతు పవనాల వలన కురిసే వర్షాలతో కొన్నిచోట్ల పంట దెబ్బతినే అవకాశముందని తెలుస్తోంది. దీంతో ఈ సీజన్‌లో కిలో రూ.60 పలికినా ఆశ్చర్యపోనవసరం లేదని వ్యాపారులు అంటున్నారు.