Share News

గుడిపాలపైపడ్డ 15 ఏనుగుల మంద

ABN , Publish Date - Jan 12 , 2026 | 01:40 AM

గుడిపాల మండలంపై 15 ఏనుగుల మంద పడింది. శనివారం రాత్రి తమిళనాడు నుంచి వచ్చిన ఏనుగులు మండలంలోని వీఎన్‌కండ్రిగ, బట్టువాళ్లూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో రామకృష్ణమనాయుడికి చెందిన 29 కొబ్బరి, 11 మామిడి చెట్లు, హరినాథనాయుడికి చెందిన కొబ్బరి చెట్లు 26, పనస చెట్టును ధ్వంసం చేశాయి.

గుడిపాలపైపడ్డ 15 ఏనుగుల మంద
వీఎన్‌కండ్రిగలో ఏనుగులు విరిచేసిన కొబ్బరి చెట్టు

గుడిపాల, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): గుడిపాల మండలంపై 15 ఏనుగుల మంద పడింది. శనివారం రాత్రి తమిళనాడు నుంచి వచ్చిన ఏనుగులు మండలంలోని వీఎన్‌కండ్రిగ, బట్టువాళ్లూరు గ్రామ పరిసర ప్రాంతాల్లో రామకృష్ణమనాయుడికి చెందిన 29 కొబ్బరి, 11 మామిడి చెట్లు, హరినాథనాయుడికి చెందిన కొబ్బరి చెట్లు 26, పనస చెట్టును ధ్వంసం చేశాయి. ప్రతి ఏడాదీ పంట చేతికి వచ్చే దశలో ఏనుగులు దాడి చేయడంతో తీవ్రంగా నష్ట పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైగా 15 ఏనుగుల మంద రావడంతో ఎప్పుడేమి జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని విన్నవిస్తున్నారు. ఆదివారం ఉదయం అటవీశాఖ అధికారులు ఏనుగుల దాడి చేసిన ప్రాంతాలను పరిశీలించారు. డ్రోన్‌ కెమెరాల సాయంతో ఏనుగులు చిత్తపార సమీపంలోని నారాయణస్వామికుంట అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. వాటిని తరిమేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - Jan 12 , 2026 | 01:40 AM