గణే్‌షకు అభినందనల వెల్లువ
ABN , Publish Date - Oct 01 , 2026 | 02:02 AM
జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో నాయుడుపేటకు చెందిన తరుమూరు గణేష్ మణిరత్నం స్వర్ణపతకం కైవసం చేసుకోవడంపై అభినందనలు వెల్లువెత్తుఉన్నాయి.
తిరుపతి అర్బన్, సెప్టెంబరు 30(ఆంధ్రజ్యోతి): జపాన్‌లోని ఐచి-నాగోయా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో నాయుడుపేటకు చెందిన తరుమూరు గణేష్ మణిరత్నం స్వర్ణపతకం కైవసం చేసుకోవడంపై అభినందనలు వెల్లువెత్తుఉన్నాయి.బుధవారం ఉదయం పురుషుల కాంపౌండ్ ఆర్చరీ పోటీల్లో ఇండియా, చైనా దేశాల తరపున ముగ్గురు చొప్పున తలపడ్డారు. ఇందులో గణేష్ అద్వితీయంగా రాణించి స్వర్ణపతకం కైవసం చేసుకోవడంతో టీవీల్లో వీక్షించిన అతడి తల్లిదండ్రులు, క్రీడాభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోయారు. శాప్ చైర్మన్ అనిమిని రవినాయుడు, పలువురు క్రీడా ప్రముఖులు గణే్‌షను అభినందించారు. యువక్రీడాకారులకు గణేష్ విజయం స్ఫూర్తిదాయకమన్నారు.భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయస్థాయి విజయాలు అందుకోవాలని రవినాయుడు ఆకాంక్షించారు.