Share News

కళాబృందాల సౌకర్యాలకు పెద్దపీట

ABN , Publish Date - Sep 02 , 2026 | 01:28 AM

నాదనీరాజనం కార్యక్రమంలో ప్రదర్శనలిచ్చే కళాబృందాల సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నట్లు ఎస్వీబీసీ చైర్మన్‌ శ్రీధర్‌ వర్మ తెలిపారు.తిరుపతిలోని ఎస్వీబీసీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన కళాబృందాల ఎంపిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

కళాబృందాల సౌకర్యాలకు పెద్దపీట
నాదనీరాజనం కళాబృందాల ఎంపిక సమావేశంలో వీడియోలను వీక్షిస్తున్న సెలక్షన్‌ కమిటీ సభ్యులు

ఎస్వీబీసీ చైర్మన్‌ శ్రీధర్‌ వర్మ

తిరుపతి(కల్చరల్‌), సెప్టెంబరు1(ఆంధ్రజ్యోతి): నాదనీరాజనం కార్యక్రమంలో ప్రదర్శనలిచ్చే కళాబృందాల సౌకర్యాలకు పెద్దపీట వేస్తున్నట్లు ఎస్వీబీసీ చైర్మన్‌ శ్రీధర్‌ వర్మ తెలిపారు.తిరుపతిలోని ఎస్వీబీసీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన కళాబృందాల ఎంపిక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఎస్వీబీసీకి కళాబృందాలు పంపిన దరఖాస్తులను, వీడియోలను పరిశీలించి ప్రతిభ, ప్రదర్శన స్థాయి, కార్యక్రమానికి అనుకూలతలపై సమీక్షించారు. అక్టోబరు, నవంబరు నెలల్లో నాదనీరాజనంలో జరిగే ప్రదర్శనలకు సంబంధించి కళా బృందాలను ఎంపిక చేశాక వారికి ఏర్పాటు చేయాల్సిన సౌకర్యాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు. సెలక్షన్‌ కమిటీ సభ్యులైన చెన్నైకి చెందిన వయొలిన్‌ విద్యాంసురాలు పద్మశ్రీ కన్యాకుమారి, హైదరాబాద్‌కు చెందిన భరతనాట్య కళాకారిణి పద్మశ్రీ ఆనంద శంకర్‌ జయంత్‌, కూచిపూడి కళాకారుడు వేదాంతం రాధేశ్యామ్‌, చెన్నైకి చెందిన వీణ విద్యాంసుడు ముడిగొండన్‌ ఎస్‌ఎన్‌ రమేష్‌, ధార్వాడ్‌కు చెందిన హిందుస్తానీ శాస్ర్తీయ గాయకుడు కైవల్యకుమార్‌ గురవ్‌, పుణెకు చెందిన కథక్‌ కళాకారుడు నంద కిషోర్‌, ఎస్వీమ్యూజిక్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌, ఎస్వీబీసీ కన్వీనర్‌ పాల్గొన్నారు.

Updated Date - Sep 02 , 2026 | 01:28 AM