94.77 శాతం పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Jan 01 , 2026 | 01:00 AM
జిల్లావ్యాప్తంగా బుధవారం 94.77 శాతం పింఛన్ల పంపిణీ జరిగింది.95.1 శాతంతో కుప్పం మున్సిపాలిటీ పింఛన్ల పంపిణీలో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది.
చిత్తూరు కలెక్టరేట్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : జిల్లావ్యాప్తంగా బుధవారం 94.77 శాతం పింఛన్ల పంపిణీ జరిగింది.95.1 శాతంతో కుప్పం మున్సిపాలిటీ పింఛన్ల పంపిణీలో జిల్లాలో ప్రథమ స్థానంలో నిలిచింది. స్థానిక ఎమ్మెల్యేల, ప్రజా ప్రతినిధుల సమక్షంలో పింఛన్లను సచివాలయ సిబ్బంది పంపిణీ చేశారు. మొత్తం 2,67, 481మందికి రూ.115.17కోట్లను అందిస్తున్నట్లు కలెక్టర్ సుమిత్‌కుమార్ తెలిపారు.పింఛన్ తీసుకోని వారికి శుక్రవారం అందించడం జరుగుతుందని చెప్పారు. చిత్తూరు నగరంలోని 36వ వార్డులో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జగన్మోహన్ పలువురికి పింఛన్లను అందించి ప్రభుత్వ పనితీరును అడిగి తెలుసుకున్నారు. మేయర్ అముద, చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తదితరులు పాల్గొన్నారు.శాంతిపురం మండలం దండికుప్పంలో కలెక్టర్ సుమిత్‌కుమార్, కడా పీడీ వికాస్ మర్మత్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పింఛన్ల పంపిణీ తీరుపై లబ్ధిదారులను అడిగి ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు.స్థానిక టీడీపీ నేతలు పలుచోట్ల పింఛన్ పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు.తవణంపల్లెలో ఎమ్మెల్యే మురళీమోహన్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరై పింఛన్లను పంపిణీ చేశారు.ఎ్‌సఆర్‌పురం మండలంలో ఎమ్మెల్యే థామస్ పింఛన్లను అందించారు.కల్లూరులో జరిగిన పింఛన్ల పంపిణీలో టీడీపీ ఇన్‌ఛార్జి చల్లాబాబు తదితరులు పాల్గొన్నారు.