94.43 శాతం పింఛన్ల పంపిణీ
ABN , Publish Date - Apr 02 , 2026 | 02:10 AM
జిల్లా వ్యాప్తంగా బుధవారం 94.43 శాతం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. 2,32,880 మందికిగాను తొలి రోజున 2,19,906 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛన్లు అందజేశారన్నారు.
చిత్తూరు (సెంట్రల్/అర్బన్), ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా బుధవారం 94.43 శాతం ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. 2,32,880 మందికిగాను తొలి రోజున 2,19,906 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛన్లు అందజేశారన్నారు. మిగిలిన 12,974 మందికి గురువారం పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. కాగా, ఉదయం చిత్తూరు నగరం కయనికట్టు వీధిలో ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, కలెక్టర్ సుమిత్ కుమార్ లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లను ఇచ్చేలా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. చిత్తూరు నగరపాలక పరిధిలో 16,032 మందికి రూ.7.11 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నరసింహ ప్రసాద్, చుడా చైర్‌పర్సన్ కఠారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, మాజీ మేయర్ అముద, సహాయ కమిషనర్ ప్రసాద్, ఎంహెచ్‌వో లోకేష్, మాజీ డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్‌రెడ్డి, టీడీపీ నగర కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.