Share News

93.83 శాతం పింఛన్ల పంపిణీ

ABN , Publish Date - Jul 02 , 2026 | 01:31 AM

జిల్లా వ్యాప్తంగా బుధవారం ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ 93.83 శాతం జరిగినట్లు డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు.

93.83 శాతం పింఛన్ల పంపిణీ
చింతలపట్టెడలో లబ్ధిదారుడికి పింఛన్‌ అందిస్తున్న ఎమ్మెల్యే భానుప్రకాష్‌

చిత్తూరు సెంట్రల్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా బుధవారం ఎన్టీఆర్‌ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీ 93.83 శాతం జరిగినట్లు డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. 2,31,531 మందికి గాను తొలి రోజున 2,17,254 మందికి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది పింఛన్లు అందజేశారు. మిగిలిన 14,277 మంది లబ్దిదారులకు గురువారం ఇవ్వనున్నట్లు పీడీ పేర్కొన్నారు.

Updated Date - Jul 02 , 2026 | 01:31 AM