Share News

మూడు జడ్పీలకు 88 మంది ఉద్యోగులు

ABN , Publish Date - Sep 25 , 2026 | 01:23 AM

జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్‌ ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయింది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలోని జిల్లా పరిషత్‌లకు 88 మంది ఉద్యోగులను కేటాయించారు. ఉద్యోగుల విభజనలో భాగంగా పోస్టుల వారీగా సిబ్బందిని మూడు జడ్పీలకు కేటాయిస్తూ జడ్పీ సీఈవో రవికమార్‌ నాయుడు వివరాలను వెల్లడించారు. ఎటువంటి సిఫార్సులకు తావులేకుండా పారదర్శకంగా ఉద్యోగుల విభజన చేపట్టామన్నారు. ఉద్యోగులు సమక్షంలోనే సీనియారిటీ జాబితా అధారంగా అధికారులు, సిబ్బందికి జిల్లాలను కేటాయించారు. ఆ ప్రకారం చిత్తూరు జడ్పీకి 38 మంది, తిరుపతికి 27, అన్నమయ్యకు 23 మంది చొప్పున ఉద్యోగులను కేటాయించారు.

మూడు జడ్పీలకు 88 మంది ఉద్యోగులు
ఉద్యోగుల సమక్షంలో స్ర్కీన్‌పై సీనియారిటీ జాబితా ప్రకారం విభజన ప్రక్రియ చేస్తున్న జడ్పీ సీఈవో

  • చిత్తూరుకు 38, తిరుపతికి 27, అన్నమయ్యకు 23 మంది చొప్పున కేటాయింపు

చిత్తూరు రూరల్‌, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిషత్‌ ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తయింది. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల పరిధిలోని జిల్లా పరిషత్‌లకు 88 మంది ఉద్యోగులను కేటాయించారు. ఉద్యోగుల విభజనలో భాగంగా పోస్టుల వారీగా సిబ్బందిని మూడు జడ్పీలకు కేటాయిస్తూ జడ్పీ సీఈవో రవికమార్‌ నాయుడు వివరాలను వెల్లడించారు. ఎటువంటి సిఫార్సులకు తావులేకుండా పారదర్శకంగా ఉద్యోగుల విభజన చేపట్టామన్నారు. ఉద్యోగులు సమక్షంలోనే సీనియారిటీ జాబితా అధారంగా అధికారులు, సిబ్బందికి జిల్లాలను కేటాయించారు. ఆ ప్రకారం చిత్తూరు జడ్పీకి 38 మంది, తిరుపతికి 27, అన్నమయ్యకు 23 మంది చొప్పున ఉద్యోగులను కేటాయించారు. దీంతో జిల్లాల పునర్విభజన అనంతరం మూడు జిల్లా పరిషత్‌లకు అవసరమైన సిబ్బంది కేటాయింపు ప్రక్రియలో కీలక ఘట్టం ముగిసింది.

విభాగాల వారీగా చూస్తే..

పరిపాలనాధికారుల (ఏవోలు) విభాగంలో చిత్తూరుకు 4, అన్నమయ్యకు 3, తిరుపతికి 3 చొప్పున 10 మందిని కేటాయించారు. మూడు జడ్పీలకు ఒక్కో డ్రైవరు వంతున ముగ్గురికి కేటాయింపు చేశారు. జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో చిత్తూరుకు 13, అన్నమయ్యకు 8, తిరుపతికి 9 మంది చొప్పున 30 మందిని.. ఆఫీస్‌ సబార్డినేట్లలో చిత్తూరుకు 6, అన్నమయ్యకు 3, తిరుపతికి నలుగురు చొప్పున 13 మందిని.. రికార్డు అసిస్టెంట్‌ పోస్టుల్లో చిత్తూరుకు ఇద్దరు, అన్నమయ్యకు ఒకరు, తిరుపతికి ఒకరు చొప్పున నలుగురిని.. సీనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుల్లో చిత్తూరుకు 8, అన్నమయ్యకు 5, తిరుపతికి ఆరుగురు చొప్పున 19 మందిని.. టైపిస్టు పోస్టుల్లో చిత్తూరుకు 4, అన్నమయ్యకు 2, తిరుపతికి ముగ్గురు చొప్పున 9 మందిని కేటాయించారు.

Updated Date - Sep 25 , 2026 | 01:23 AM