ఈఏపీసెట్‌లో 71.34శాతం మందికి అర్హత
ABN , Publish Date - Jul 02 , 2026 | 01:33 AM
ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (ఏపీ ఈఏపీసెట్) ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 71.34 శాతం మంది అర్హత సాధించారు. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జేఎన్‌టీయూకే మే 12 నుంచి 15 వరకు, 18 నుంచి 26 వరకు రెండు విడతలుగా ఈ పరీక్షలు నిర్వహించింది.
చిత్తూరు సెంట్రల్, జూలై 1(ఆంధ్రజ్యోతి): ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్టు (ఏపీ ఈఏపీసెట్) ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 71.34 శాతం మంది అర్హత సాధించారు. ఏపీ స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జేఎన్‌టీయూకే మే 12 నుంచి 15 వరకు, 18 నుంచి 26 వరకు రెండు విడతలుగా ఈ పరీక్షలు నిర్వహించింది. జిల్లాలో 7253 మంది రిజిస్ట్రర్ చేసుకోగా 6626 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో 4,727 మంది అర్హత సాధించారు. 3365 మంది బాలురకు గాను 2739 మంది పరీక్ష రాశారు. 2057 మంది(75.10శాతం)అర్హత సాధించారు. 3,888 మందికి విద్యార్థినులకుగాను 3587 మంది పరీక్ష రాశారు. 2670 మంది(74.43శాతం) మంది అర్హత పొందారు. పూతలపట్టు మండలం పేటమిట్టలోని మంగళ్ విద్యాలయం విద్యార్థి జి. వెంకి 994 ర్యాంకు సాధించాడు.
ఫ ఇంజనీరింగ్ విభాగంలో... 5140 మంది పరీక్షకు హాజరు కాగా 3411 మంది అర్హత సాధించారు. వీరిలో 3015 మంది బాలురకు గాను 2739 మంది పరీక్ష రాశారు. 1794 మంది అర్హత సాధించారు. 2591 మంది విద్యార్థినులకు గాను 2,401 మంది పరీక్ష రాశారు. వీరిలో 1617 మంది అర్హత సాధించారు.
ఫ అగ్రికల్చర్, పార్మసీ విభాగంలో.. 1647 మంది నమోదు చేసుకున్నారు. 1486 మంది పరీక్షకు హాజరయ్యారు. 1316 మంది అర్హత సాధించారు. 350 మంది బాలురకు గాను 300 మంది పరీక్ష రాయగా, 263 మంది అర్హత సాధించారు. 1297 మంది విద్యార్థినులకు గాను 1186 మంది పరీక్ష రాశారు. 1053 మంది అర్హత సాధించారు.