‘టెట్’కు 6510 మంది అభ్యర్థులు
ABN , Publish Date - Jul 30 , 2026 | 12:57 AM
లాఆ్లలో ఆగస్టు 5 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించే ‘టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్)’కు 6510 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు.
చిత్తూరు సెంట్రల్, జూలై 29 (ఆంధ్రజ్యోతి): లాఆ్లలో ఆగస్టు 5 నుంచి 16వ తేదీ వరకు నిర్వహించే ‘టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్టు (టెట్)’కు 6510 మంది అభ్యర్థులు పోటీ పడనున్నారు. ఆన్‌లైన్ ద్వారా పరీక్షలు రాసేందుకు ఇప్పటికే జిల్లా విద్యాశాఖ ఐదు కేంద్రాలు గుర్తించింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా పరీక్షా కేంద్రాలు కేటాయించారు. చిత్తూరులోని శ్రీనివాస ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (సీటమ్స్)కు 180 మంది.. శ్రీ వేంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ (ఎస్వీసెట్)కు 1292 మంది.. పలమనేరులోని మథర్ థెరిసా ఇంజనీరింగ్ కళాశాలకు 2460 మంది.. కుప్పంలోని ద్రవిడ యూనివర్శిటీకి 687 మంది. కుప్పం ఇంజనీరింగ్ కళాశాలకు 1891 మంది అభ్యర్థులను కేటాయించారు.