ప్రాణదానం పథకానికి 623మంది ఎంపిక
ABN , Publish Date - Oct 06 , 2026 | 03:09 AM
స్విమ్స్ ఆస్పత్రిలో ప్రాణదానం పథకం కింద ఉచిత ఆపరేషన్లకు 623మంది రోగులను ఎంపిక చేశారు.స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ అధ్యక్షతన సోమవారం ప్రాణదానం కమిటీ సమావేశం జరిగింది. పద్మావతి చిన్నపిల్లల
తిరుపతి సెంట్రల్, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): స్విమ్స్ ఆస్పత్రిలో ప్రాణదానం పథకం కింద ఉచిత ఆపరేషన్లకు 623మంది రోగులను ఎంపిక చేశారు.స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ అధ్యక్షతన సోమవారం ప్రాణదానం కమిటీ సమావేశం జరిగింది. పద్మావతి చిన్నపిల్లల హృదయాలయ డైరెక్టర్ డాక్టర్ శ్రీనాధరెడ్డి, స్విమ్స్ ఎంఎస్ డాక్టర్ రాం, రుయాస్పత్రి సీఎస్‌ఆర్‌ఎంవో సుబ్బులక్ష్మి, మెటర్నిటీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాసులు, స్విమ్స్ విభాగాధిపతులు పాల్గొన్నారు. దాదాపు రూ.2.20 కోట్లతో ఉచితంగా చికిత్స అందించడంతో పాటు ఆపరేషన్లు చేయడానికి 623మంది రోగులను ఎంపిక చేశారు. వీరిలో కార్డియాలజీకి సంబంధించి 36మందిని, కార్డియోథొరాసిక్-26, ఎండోక్రైనాలజీ-2, ఈఎన్‌టీ-11, జనరల్ సర్జరీ-64, మెడిసిన్-26, మెడికల్ ఆంకాలజీ-26, నెప్రాలజీ-149, న్యూరాలజీ-64, న్యూక్లియర్ మెడిసిన్-2, న్యూరోసర్జరీ-41,గైనకాలజీ-51,పీడియాట్రిక్స్-3, సైకియాట్రీ-2, రేడియాలజీ-6, రేడియేషన్ ఆంకాలజీ-16, గ్యాస్ట్రో ఎంట్రాలజీ-73, సర్జికల్ ఆంకాలజీ-24, యూరాలజీకి సంబంధించి ఒకరిని ఎంపిక చేశారు.