Share News

తిరుపతి కార్పొరేషన్‌కు 543 నామినేషన్లు

ABN , Publish Date - Oct 25 , 2026 | 01:22 AM

తిరుపతి నగర కార్పొరేషన్‌లో ఎన్నికల కమిషన్‌ రెండవసారి అవకాశం కల్పించిన 18 డివిజన్లకు శనివారం 38 నామినేషన్లు దాఖలయ్యాయి.శుక్రవారం 59 నామినేషన్లు వచిన్చ విషయం తెలిసిందే. శనివారం దాఖలైన 38నామినేషన్లలో టీడీపీ ఒకటి, జనసేన పార్టీ ఒకటి, వైసీపీ 22, బీఎస్పీ 2, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒకటి, ఇండిపెండెంట్లు 11 చొప్పున వున్నాయి.

 తిరుపతి కార్పొరేషన్‌కు 543 నామినేషన్లు
తిరుపతి కలెక్టరేట్‌కు శనివారం నామినేషన్‌ వేయడానికి వచ్చిన అభ్యర్థులను వివరాలడుగుతున్న పోలీసులు

  • 66 డివిజన్లకు టీడీపీ 204... వైసీపీ 161

  • ఎస్‌ఈసీ ఇచ్చిన గడువులో 97 దాఖలు

తిరుపతి సెంట్రల్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): తిరుపతి నగర కార్పొరేషన్‌లో ఎన్నికల కమిషన్‌ రెండవసారి అవకాశం కల్పించిన 18 డివిజన్లకు శనివారం 38 నామినేషన్లు దాఖలయ్యాయి.శుక్రవారం 59 నామినేషన్లు వచిన్చ విషయం తెలిసిందే. శనివారం దాఖలైన 38నామినేషన్లలో టీడీపీ ఒకటి, జనసేన పార్టీ ఒకటి, వైసీపీ 22, బీఎస్పీ 2, ఆమ్‌ ఆద్మీ పార్టీ ఒకటి, ఇండిపెండెంట్లు 11 చొప్పున వున్నాయి. మొత్తంగా ఈనెల 16, 17, 18 తేదీలలో దాఖలైనవి, శుక్ర-శని వారాల్లో దాఖలైనవి కలిపి చూస్తే 66 డివిజన్లకు 543 నామినేషన్లు దాఖలయ్యాయి. పార్టీల వారీగా టీడీపీ నుంచీ అత్యధికంగా 204 నామినేషన్లు రాగా వైసీపీ నుంచీ 161 నామినేషన్లు వచ్చాయి. జనసేన నుంచీ 81 నామినేషన్లు, బీజేపీ నుంచీ 15, సీపీఐ నుంచీ 4, బీఎస్పీ నుంచీ 2, సీపీఎం, కాంగ్రెస్‌ల నుంచీ ఒక్కొక్కటి చొప్పున నామినేషన్లు వేశారు. ఇతర పార్టీల తరపున 5, ఇండిపెండెంట్ల నుంచీ 69 నామినేషన్లు వచ్చాయి.శుక్ర, శనివారాల్లో దాఖలైన నామినేషన్ల స్ర్కూటినీ నేటి ఉదయం 8 గంటల నుంచీ చేపట్టనున్నారు. అదే విధంగా కొత్తగా దాఖలైన నామినేషన్లను ఉపసంహరించుకునే గడువు నేటి మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. 3 గంటల తర్వాత పోటీలో వున్న అభ్యర్థుల తుది జాబితా ప్రకటించనున్నారు.

Updated Date - Oct 25 , 2026 | 01:22 AM