Share News

రేపు 5,026 ఈ-సైకిళ్ల పంపిణీ

ABN , Publish Date - Jan 30 , 2026 | 02:43 AM

జిల్లా వ్యాప్తంగా 5,026 మంది లబ్ధిదారులకు శనివారం కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు ఈ-సైకిళ్లను పంపిణీ చేయనున్నారు.

రేపు 5,026 ఈ-సైకిళ్ల పంపిణీ
పంపిణీకి సిద్ధంగా ఈ-సైకిళ్లు

గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డులో స్థానం దక్కించుకోనుందన్న కలెక్టర్‌

కుప్పం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా 5,026 మంది లబ్ధిదారులకు శనివారం కుప్పం పర్యటనలో సీఎం చంద్రబాబు ఈ-సైకిళ్లను పంపిణీ చేయనున్నారు. మోర్టార్‌ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 24 గంటల్లో 5,026 ఈ-సైకిళ్ల పంపిణీ ద్వారా గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం లభించనుందని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ చెప్పారు. గుడుపల్లె మండలం గుత్తార్లపల్లె పంపిణీకి సిద్ధంగా ఉంచిన ఈ-సైకిళ్లను గురువారం ఆయన పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ-సైకిల్‌ ఒకసారి చార్జి చేస్తే 40 కిలోమీటర్లు ప్రయాణింవచ్చన్నారు. పర్యావరణ హితమైన ఈ వాహనాలు గ్రామీణ, పట్టణ ప్రజల రవాణా అవసరాలు తీర్చడంలో ఉపయోగపడుతాయన్నారు. లబ్ధిదారులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.

Updated Date - Jan 30 , 2026 | 02:43 AM