Share News

కడప జోన్‌కు 500 ఎలక్ర్టిక్‌ బస్సులు

ABN , Publish Date - Apr 24 , 2026 | 12:33 AM

కడప జోన్‌కు సెప్టెంబర్‌ నాటికి 500 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులు రానున్నాయని ఆర్టీసీ కడప జోనల్‌ చైర్మన్‌ పూల నాగరాజు స్పష్టం చేశారు.

 కడప జోన్‌కు 500 ఎలక్ర్టిక్‌ బస్సులు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న పూల నాగరాజు

కడప మారుతీనగర్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): కడప జోన్‌కు సెప్టెంబర్‌ నాటికి 500 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులు రానున్నాయని ఆర్టీసీ కడప జోనల్‌ చైర్మన్‌ పూల నాగరాజు స్పష్టం చేశారు. గురువారం కడపలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త ఎలక్ట్రిక్‌ బస్సుల్లో కడప డిపోకు 50, కర్నూలుకు 50, అనంతపురానికి 50, మిగిలిన 350 బస్సులు తిరుమల తిరుపతి డిపోలకు రానున్నాయన్నారు. కడప జోన్‌ వ్యాప్తంగా సుమారు 4,196 బస్సులు ఉన్నాయన్నారు. అందులో 2,852 బస్సులు స్ర్తీశక్తి కోసం కేటాయించామన్నారు. ఎనిమిది నెలల కాలంలో కడప జోన్‌ వ్యాప్తంగా 15.88 లక్షల కిలోమీటర్లు లక్ష్యంగా బస్సులు తిరగాల్సి ఉండగా ఇందులో 15.17 లక్షల కి.మీ తిరిగాయన్నారు. కడప జోన్‌లో 382 బస్సుల కొరత ఉందని, ఆ లోటు పూడ్చేందుకు వీలుగా రానున్న సెప్టెంబరు చివరి నాటికి 500 కొత్త ఎలక్ట్రిక్‌ బస్సులతో పాటు అదనంగా మరిన్ని బస్సులు సమకూర్చుకుంటామన్నారు. సమావేశంలో ఆర్టీసీ కడప రీజనల్‌ మేనేజరు పొలిమేర గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 12:33 AM