తిరుపతి ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 50 శాతం ఇన్ సర్వీసు సీట్లకు కోత
ABN , Publish Date - May 15 , 2026 | 12:50 AM
తిరుపతిలోని పద్మావతమ్మ నర్సింగ్ కళాశాలలో ఎంఎస్‌సీ (నర్సింగ్)లో చేరడానికి ఇప్పటి వరకూ ఉన్న ఇన్ సర్వీసు సీట్లలో సగానికి తగ్గిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
కలికిరి, మే 14 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలోని పద్మావతమ్మ నర్సింగ్ కళాశాలలో ఎంఎస్‌సీ (నర్సింగ్)లో చేరడానికి ఇప్పటి వరకూ ఉన్న ఇన్ సర్వీసు సీట్లలో సగానికి తగ్గిస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నర్సింగ్ కాలేజీలో ఎంఎస్‌సీ (నర్సింగ్)లో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 40 శాతం అంటే 20 సీట్లను బీఎస్‌సీ (నర్సింగ్‌తో) ప్రభుత్వ ఆసుపత్రుల్లో నర్సులుగా పనిచేసే వారికి కేటాయించారు. ఇన్ సర్వీసు కోటాలో సీట్లు పొందిన వారికి సర్వీసులో దీన్ని డిప్యుటేషన్‌గా పరిగణించి వెసులుబాటు కలిగించేవారు. తాజాగా ప్రసుతమున్న 40 శాతం సీట్లలో సగానికి కోత విధించి 10 సీట్లు మాత్రమే ఇన్ సర్వీసు నర్సులకు కేటాయించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. అదేవిధంగా ప్రస్తుతం సర్వీసులో ఉన్న నర్సులకు ఉన్నత విద్య కోసం డిప్యుటేషన్ విధానాన్నే కొనసాగించనున్నట్లు పేర్కొంటూ రాష్ట్ర ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్‌గౌర్ గురువారం ఆదేశాలు జారీ చేశారు.