440 బస్తాల రేషన్ బియ్యం పట్టివేత
ABN , Publish Date - Apr 23 , 2026 | 12:47 AM
లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.... చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి మొగిలిఘాట్ వద్ద పోలీసులు బుధవారం వాహనాలు తనిఖీ చేస్తున్నారు.
బంగారుపాళ్యం,ఏప్రిల్ 22(ఆంధ్రజ్యోతి): లారీలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ ప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.... చెన్నై-బెంగళూరు జాతీయ రహదారి మొగిలిఘాట్ వద్ద పోలీసులు బుధవారం వాహనాలు తనిఖీ చేస్తున్నారు. ఈక్రమంలో చిత్తూరు నుంచి బెంగళూరుకు వెళ్తున్న ఓ లారీని తనిఖీ చేయగా 21,850 కిలోల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.4.37 లక్షల ఉంటుంది. లారీ డ్రైవర్ ప్రదీప్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని, ప్రధాన నిందుతుడు కిరణ్‌కుమార్ పరారీలో ఉన్నాడని ఎస్‌ఐ తెలిపారు. త్వరలో పట్టుకుంటామన్నారు.