తవణంపల్లెలో 42.3 డిగ్రీలు
ABN , Publish Date - Apr 22 , 2026 | 01:56 AM
రోహిణి కార్తె ఇంకా ప్రారంభం కాకముందే భగభగమంటున్న ఎండలతో జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. జిల్లావ్యాప్తంగా మంగళవారం 37 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రోహిణి కార్తె ఇంకా ప్రారంభం కాకముందే భగభగమంటున్న ఎండలతో జిల్లా ప్రజలు అల్లాడుతున్నారు. జిల్లావ్యాప్తంగా మంగళవారం 37 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా తవణంపల్లెలో 42.3, శ్రీరంగరాజపురంలో 42.0 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. మండలాల వారీగా నిండ్రలో 41.8, చిత్తూరు రూరల్, గుడిపాలలో 41.4, గంగవరంలో 40.8, రొంపిచెర్లలో 40.7, పలమనేరులో 40.4, పులిచెర్ల, వెదురుకుప్పంలో 39.9, పెద్దపంజాణి, బంగారుపాళ్యంలో 39.8, గంగాధరనెల్లూరు, ఐరాల, పాలసముద్రం, పెనుమూరు, పూతలపట్టు, యాదమరిలో 39.7, చిత్తూరు అర్బన్‌లో 39.6, శాంతిపురంలో 38.6, నగరి, విజయపురంలో 38.4, కార్వేటినగరంలో 38.1, గుడుపల్లె, కుప్పం, రామకుప్పంలో 37.1, బైరెడ్డిపల్లె, వి.కోటలో 36.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా బుధ, గురువారాల్లో ఇంతకుమించి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విపత్తు నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు.
- చిత్తూరు కలెక్టరేట్, ఆంధ్రజ్యోతి