421 నామినేషన్లు దాఖలు
ABN , Publish Date - Oct 18 , 2026 | 01:49 AM
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి శనివారం జిల్లాలో మొత్తం 421 నామినేషన్లు దాఖలయ్యాయి.తిరుపతిలో మేయర్ స్థానానికి టీడీపీ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ నామినేషన్ వేశారు.
421 నామినేషన్లు దాఖలు
మేయర్, ఛైర్మన్ స్థానాలకు 21
తిరుపతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి శనివారం జిల్లాలో మొత్తం 421 నామినేషన్లు దాఖలయ్యాయి.తిరుపతిలో మేయర్ స్థానానికి టీడీపీ అభ్యర్థి జేబీ శ్రీనివాస్ నామినేషన్ వేశారు. వెంకటగిరిలో టీడీపీ ఛైర్మన్ అభ్యర్థి బొంతు శారద, వైసీపీ అభ్యర్థి బొలిగల దివ్య నామినేషన్లు వేశారు. నాయుడుపేట ఛైర్మన్ స్థానానికి టీడీపీ అభ్యర్థి షేక్ షకీరా,వైసీపీ అభ్యర్థి తంబిరెడ్డి రాజేశ్వరమ్మ కూడా నామినేషన్ పత్రాలు సమర్పించారు. సూళ్ళూరుపేటలో వైసీపీ అభ్యర్థిగా మోడి విమలకుమారి నామినేషన్ దాఖలు చేశారు.తిరుపతి కార్పొరేషన్లో మేయర్ స్థానానికి దాఖలైన 11 నామినేషన్లలో టీడీపీ నుంచీ ఒకటి, స్వతంత్రులు వేసినవి పది వున్నాయి. అక్కడే 66 డివిజన్లకు దాఖలైన 184 నామినేషన్లలో టీడీపీ నుంచీ 86, జనసేన నుంచీ 18, బీజేపీ నుంచీ 8, వైసీపీ నుంచీ 18, సీపీఎం నుంచీ ఒకటి, స్వతంత్రుల నుంచీ 47, ఇతరుల నుంచీ 6 చొప్పున వున్నాయి. సూళ్ళూరుపేటలో ఛైర్మన్ స్థానానికి దాఖలైన రెండు నామినేషన్లూ వైసీపీవే. అక్కడ 32 వార్డులకు గానూ 47 నామినేషన్లు దాఖలైతే వాటిలో బీజేపీవి 4, టీడీపీవి 16, వైసీపీవి 19, జనసేనవి 2, స్వతంత్రులవి 6 చొప్పున వున్నాయి. నాయుడుపేటలో ఛైర్మన్ స్థానానికి వచ్చిన రెండు నామినేషన్లలో ఒకటి టీడీపీది, మరోటి వైసీపీది వున్నాయి. అక్కడ 32 వార్డులకు దాఖలైన 29 నామినేషన్లలో బీజేపీ నుంచీ ఒకటి, టీడీపీ నుంచీ మూడు, వైసీపీ నుంచీ 22, జనసేన నుంచీ ఒకటి, స్వతంత్రుల నుంచీ రెండు వున్నాయి.వెంకటగిరిలో ఛైర్మన్ స్థానానికి వచ్చిన 3 నామినేషన్లలో బీఎస్పీ, టీడీపీ, వైసీపీ నుంచీ ఒక్కొక్కటి చొప్పున వున్నాయి.36 వార్డులకు గానూ 64 నామినేషన్లు రాగా వాటిలో టీడీపీవి 39, వైసీపీవి 24, స్వతంత్రులవి ఒకటి చొప్పున వున్నాయి. పుత్తూరులో ఛైర్మన్ స్థానానికి దాఖలైన మూడు నామినేషన్లూ వైసీపీవే. అక్కడ 36 వార్డులకు గానూ దాఖలైన 76 నామినేషన్లలో టీడీపీవి 48, వైసీపీవి 24, జనసేనవి 2, స్వతంత్రులవి 2 చొప్పున వున్నాయి.
-----------------------------
చేస్తున్నారు.