Share News

40 కిలోల గంజాయి స్వాధీనం

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:48 AM

కుప్పంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు

40 కిలోల గంజాయి స్వాధీనం
నిందితుల అరెస్టు చూపుతున్న పోలీసులు

కుప్పం, మార్చి 2(ఆంధ్రజ్యోతి): కుప్పంలో గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసినట్లు డీఎస్పీ పార్థసారథి, సీఐ శంకరయ్య తెలిపారు. 40 కిలోల గంజాయిని సీజ్‌ చేశామన్నారు. ఈ మేరకు సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. వారు తెలిపిన ప్రకారం.. ఒడిశాలోని కటక్‌ ప్రాంతం నుంచి కొందరు రైలులో కేరళకు కొన్నాళ్లుగా గంజాయి తీసుకొస్తున్నారు. తమిళనాడులో ఎన్నికల నేపథ్యంలో నిఘా తీవ్రతరం కావడంలో వారు రూటు మార్చుకున్నారు. కుప్పం మీదుగా తరలిస్తున్నారు. ఈ సమాచారంతో సోమవారం ఉదయం రైల్వే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించడంతో గంజాయి రవాణా విషయం బహిర్గతమైంది. నిందితులు పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌ జిల్లాకు చెందిన ఎస్‌.కే.హాసిబుల్‌, ఎస్‌.కే.నాజిముల్‌, సౌమిక్‌ మండల్‌, సుమన్‌దా్‌స, ఎస్‌.కే.హాసినూర్‌ జమాన్‌, ముత్తకిమ్‌ మాలిత, కిరణ్‌ మండల్‌, మోజమ్‌ మండల్‌లుగా గుర్తించారు. వీరిలో ఒకరు మినహా మిగిలిన వారంతా యువకులే. వీరి నుంచి సుమారు 40 కిలోల గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి వీరిని రిమాండుకు తరలించినట్లు పోలీసు అధికారులు వివరించారు.

Updated Date - Mar 03 , 2026 | 12:48 AM