Share News

వరసిద్ధుని దర్శనానికి 4 గంటల సమయం

ABN , Publish Date - Apr 27 , 2026 | 01:18 AM

స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో ఆదివారం స్వామివారి దర్శనార్థం ఆలయానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు.

వరసిద్ధుని దర్శనానికి 4 గంటల సమయం
క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు

ఐరాల(కాణిపాకం), ఏప్రిల్‌ 26 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. వేసవి సెలవులు ప్రారంభం కావడంతో ఆదివారం స్వామివారి దర్శనార్థం ఆలయానికి వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ఆలయ క్యూలైన్లు నిండి వెలుపల వరకు వ్యాపించారు. ఎండ వేడిమి నుంచి భక్తులకు ఉపశమనం కల్పించడానికి ఫ్యాన్లు, కూలర్లు ఏర్పాటు చేశారు. భక్తులకు తాగునీరు అందించారు. క్యూలైన్లలో రద్దీని నియంత్రించడానికి ఆలయ చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్‌ కృషి చేశారు.

Updated Date - Apr 27 , 2026 | 01:18 AM