వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు
ABN , Publish Date - Jan 12 , 2026 | 01:38 AM
స్వయంభు కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. శబరిమల జ్యోతి దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులు వేల సంఖ్యలో తరలిరావడంతో రద్దీ నెలకొంది.
ఐరాల(కాణిపాకం), జనవరి 11 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి నాలుగు గంటల సమయం పట్టింది. శబరిమల జ్యోతి దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులు వేల సంఖ్యలో తరలిరావడంతో రద్దీ నెలకొంది. క్యూలైన్లు ఆలయం వెలుపలకు వ్యాపించాయి. ప్రతి భక్తుడికీ స్వామి దర్శనం కల్పించడానికి చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్ కృషి చేశారు.