Share News

వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు

ABN , Publish Date - Mar 22 , 2026 | 01:04 AM

స్వయంభు కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. వరుస సెలవులు కావడంతో ఆలయానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయడంతో ఆలయ క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి.

వరసిద్ధుడి దర్శనానికి 4 గంటలు

ఐరాల (కాణిపాకం), మార్చి 21 (ఆంధ్రజ్యోతి): స్వయంభు కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. వరుస సెలవులు కావడంతో ఆలయానికి జిల్లా నలుమూలల నుంచి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో విచ్చేయడంతో ఆలయ క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. దీంతో ఆలయం వద్ద రద్దీ వాతావరణం ఏర్పడింది. స్వామివారి దర్శనానికి విచ్చేసిన భక్తులు ఆలయ క్యూలైన్లలో ఇబ్బందులు పడకుండా ఆలయ చైర్మన్‌ మణినాయుడు, ఈవో పెంచల కిషోర్‌ చర్యలు తీసుకున్నారు. క్యూలైన్లలో భక్తుల దాహార్తిని తీర్చడానికి ఆలయ సిబ్బంది తాగునీరు అందించారు. ప్రతి భక్తుడికి స్వామివారి దర్శనం కల్పించడానికి ఆలయ అధికారులు కృషి చేశారు.

Updated Date - Mar 22 , 2026 | 01:04 AM