వరసిద్ధుని దర్శనానికి 4 గంటలు
ABN , Publish Date - Jul 19 , 2026 | 01:45 AM
స్వయంబు కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి శనివారం నాలుగు గంటల సమయం పట్టింది. ఉదయం నుంచి స్వామి దర్శనార్థం భారీగా భక్తులు ఆలయానికి విచ్చేశారు.
ఐరాల(కాణిపాకం), జూలై 18 (ఆంధ్రజ్యోతి): స్వయంబు కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి శనివారం నాలుగు గంటల సమయం పట్టింది. ఉదయం నుంచి స్వామి దర్శనార్థం భారీగా భక్తులు ఆలయానికి విచ్చేశారు. దీంతో ఆలయ క్యూలైన్లు పూర్తిగా నిండిపోయాయి. వెలుపల వరకు క్యూలు విస్తరించాయి. క్యూలైన్లలో భక్తులు ఇబ్బందులు పడకుండా ఆలయ కమిటీ చైర్మన్ మణినాయుడు, ఈవో పెంచలకిషోర్ దగ్గరుండి క్యూలైన్లను పర్యవేక్షించారు. భక్తుల దాహార్తి తీర్చడానికి సిబ్బంది తాగునీరు అందజేసేలా చర్యలు తీసుకున్నారు. ఆదివారం కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.