Share News

వరసిద్ధుని దర్శనానికి 4 గంటలు

ABN , Publish Date - Jul 12 , 2026 | 01:26 AM

స్వయంబు కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి శనివారం నాలుగు గంటల సమయం పట్టింది. వరుస సెలవులు కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి వేలాదిగా భక్తులు స్వామివారి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చారు.

వరసిద్ధుని దర్శనానికి 4 గంటలు
ఆలయం వెలుపల క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు

ఐరాల(కాణిపాకం), జూలై 11 (ఆంధ్రజ్యోతి): స్వయంబు కాణిపాక వరసిద్ధుడి దర్శనానికి శనివారం నాలుగు గంటల సమయం పట్టింది. వరుస సెలవులు కావడంతో ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం నుంచి వేలాదిగా భక్తులు స్వామివారి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చారు. భక్తుల రద్దీ పెరగడంతో ఆలయ క్యూలైన్లు పూర్తిగా నిండి పోయాయి. వెలుపల ఉన్న క్యూలైన్ల వరకు విస్తరించాయి. క్యూలైన్లలో భక్తుల దాహార్తిని తీర్చడానికి ఆలయ సిబ్బంది తాగునీరు అందించారు. వెలుపల భక్తులకు మజ్జిగను అందించారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఈవో పెంచలకిషోర్‌ దగ్గరుండి క్యూలైన్లను పర్యవేక్షించారు. భక్తుల తాకిడి సాయంత్రం వరకు కొనసాగింది.

Updated Date - Jul 12 , 2026 | 01:26 AM