Share News

37,478 - గ్యాస్‌ రీఫిల్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్నవారి సంఖ్య

ABN , Publish Date - Mar 20 , 2026 | 02:02 AM

జిల్లాలో గురువారానికి 37,478 మంది గ్యాస్‌ రీఫిల్‌ కోసం బుకింగ్‌ చేసుకుని వేచి ఉన్నారు. గ్యాస్‌ ఎప్పుడు అయిపోతుందోనన్న ఆందోళన.. రీఫిల్‌ సిలిండర్‌ ఎప్పుడు వస్తుందోనన్న టెన్షన్‌తో ఉగాది పండగ జరిగిపోయింది. రంజాన్‌ను ఈ ఆందోళన వెన్నాడుతోంది. గతంలో 24 గంటల్లో డెలివరీ చేసేవారు. ప్రస్తుతం 4-7 రోజుల సమయం తీసుకుంటున్నారు. శుభకార్యాలకు ఆహారం సరఫరా చేసే క్యాటరింగ్‌ నిర్వాహకులు సైతం వంటగ్యాస్‌ సిలిండర్ల కొరతతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 42 మంది గ్యాస్‌ ఏజెన్సీదారులుండగా 5,09,147 కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో డొమెస్టిక్‌ 5,02,905, వాణిజ్య సిలిండర్లు 6242 ఉన్నాయి.

37,478   - గ్యాస్‌ రీఫిల్‌ కోసం వెయిటింగ్‌లో ఉన్నవారి సంఖ్య

చిత్తూరు కలెక్టరేట్‌, ఆంధ్రజ్యోతి : జిల్లాలో గురువారానికి 37,478 మంది గ్యాస్‌ రీఫిల్‌ కోసం బుకింగ్‌ చేసుకుని వేచి ఉన్నారు. గ్యాస్‌ ఎప్పుడు అయిపోతుందోనన్న ఆందోళన.. రీఫిల్‌ సిలిండర్‌ ఎప్పుడు వస్తుందోనన్న టెన్షన్‌తో ఉగాది పండగ జరిగిపోయింది. రంజాన్‌ను ఈ ఆందోళన వెన్నాడుతోంది. గతంలో 24 గంటల్లో డెలివరీ చేసేవారు. ప్రస్తుతం 4-7 రోజుల సమయం తీసుకుంటున్నారు. శుభకార్యాలకు ఆహారం సరఫరా చేసే క్యాటరింగ్‌ నిర్వాహకులు సైతం వంటగ్యాస్‌ సిలిండర్ల కొరతతో ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో 42 మంది గ్యాస్‌ ఏజెన్సీదారులుండగా 5,09,147 కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో డొమెస్టిక్‌ 5,02,905, వాణిజ్య సిలిండర్లు 6242 ఉన్నాయి. గురువారానికి ఏజెన్సీల వద్ద 15,882 సిలిండర్లు నిల్వ ఉన్నాయి. రీఫిల్‌ కోసం బుకింగ్‌ చేసుకుని వెయిటింగ్‌లో ఉన్నవారి సంఖ్య 37,478. గురువారం ఒక్కరోజే 11,732 సిలిండర్ల పంపిణీ జరిగింది. అత్యవసరాలకోసం హాస్పిటల్స్‌, పాఠశాలలకు 135 సిలిండర్లను అందించారు. సగటున రోజుకు 17వేల సిలిండర్ల బుకింగ్‌ జరుగుతుండగా, 13 వేల సిలిండర్ల డెలివరీ జరుగుతున్నది. అత్యధికంగా ఐవోసీ కంపెనీవే ఎక్కువ సిలిండర్ల కనెక్షన్లు ఉండగా, రెండో స్థానంలో హెచ్‌పీసీ, మూడో స్థానంలో బీపీసీ సిలిండర్లు ఉన్నాయి. అనధికారికంగా గృహవినియోగ గ్యాస్‌ సిలిండర్లు వాడే చిన్న హోటల్‌ నిర్వాహకులు, టీదుకాణాల నిర్వాహకులు కూడా ఇబ్బందుల్లో చిక్కుకున్నారు. గతంలో సిలిండర్‌పై రూ.వంద అదనంగా తీసుకుని ఇచ్చేవారు. ఇప్పుడు సిలిండర్‌ దొరకడమే గగనం కావడంతో అల్పాహారశాలలు, బిరియానీ హోటళ్ళు, చిన్నపాటి హోటళ్ళు మూతపడుతున్నాయి. కొందరు ఏజెన్సీ నిర్వాహకులు మాట్లాడుతూ వాణిజ్య గ్యాస్‌ సిలిండర్ల కొరత ఉందని చెబుతూ డొమెస్టిక్‌ సిలిండర్ల సమస్య 2-3 రోజుల్లో పరిష్కారమవుతుందన్నారు.

మారిన బుకింగ్‌ నిబంధనలు

వినియోగదారులు సిలిండర్లను రిజర్వ్‌ చేసుకునే ఉద్దేశంతో బుకింగ్‌ కోసం తరచూ కాల్‌ చేస్తుండడంతో సైట్‌ పై రద్దీ పెరిగింది. దీంతో గ్యాస్‌ బుకింగ్‌ను కంపెనీలు కఠినతరం చేశాయి. కొత్తగా తెచ్చిన నిబంధనలపై పలువురు వినియోగదారులకు అవగాహన లేక, బుకింగ్‌ చేసుకోలేక అల్లాడుతున్నారు.

ఫ బుకింగ్‌కు ఈకేవైసీ నమోదు తప్పనిసరి.

ఫ వాట్సప్‌ నెంబరు 77180 12345 ద్వారా బుకింగ్‌ చేసుకోవాలి. సాయంత్రం 6 గంటల తర్వాత బుక్‌ చేసుకోవడం మేలు.

ఫ వాట్స్‌పలో రీఫిల్‌ అని సంక్షిప్త సందేశం పంపాలి.

ఫ గతంలో నిర్ణీత గడువు లేకుండా బుక్‌ చేసిన తక్షణమే సిలిండర్‌ ఇచ్చేవారు. ప్రస్తుతం కనీసం 25 రోజుల పాటు వ్యవధి ఉండేలా చూసుకోవాలి.

ఫ రిజిస్టర్డ్‌ మొబైల్‌ నెంబర్‌ను అందుబాటులో ఉంచుకోవాలి.

ఫ ముందస్తుగా బుక్‌చేసుకున్న వారికి మాత్రమే సిలిండర్‌ ఇస్తారు.

ఫ డెలివరి అథెంటికేషన్‌ కోడ్‌ లేకుండా సిలిండరు ఇవ్వరు.

Updated Date - Mar 20 , 2026 | 02:02 AM