జిల్లాస్థాయి క్రీడా పోటీలకు 3300 మంది ఎంపిక
ABN , Publish Date - Aug 01 , 2026 | 02:21 AM
అమరావతి చాంపియన్‌షి్‌ప-2026కు సంబంధించి జిల్లా స్థాయి పోటీలకు 3300 మంది ఎంపికయ్యారు. దీనికిగాను నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించిన ఎంపిక పోటీలు శుక్రవారంతో ముగిశాయి. అండర్-17, అండర్-23 బాలబాలికల విభాగంలో అథ్లెటిక్స్, విలువిద్య, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరిగాయి.
చిత్తూరు క్రీడలు, జూలై 31(ఆంధ్రజ్యోతి): అమరావతి చాంపియన్‌షి్‌ప-2026కు సంబంధించి జిల్లా స్థాయి పోటీలకు 3300 మంది ఎంపికయ్యారు. దీనికిగాను నియోజకవర్గాల స్థాయిలో నిర్వహించిన ఎంపిక పోటీలు శుక్రవారంతో ముగిశాయి. అండర్-17, అండర్-23 బాలబాలికల విభాగంలో అథ్లెటిక్స్, విలువిద్య, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరిగిన ఈ ఎంపిక పోటీలకు 4713 మంది క్రీడాకారులు పాల్గొన్నారని డీఎ్‌సడీవో ఉదయ్‌భాస్కర్ తెలిపారు. వీరిలో 3300 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు చెప్పారు. వీరు ఈ నెల 6 నుంచి జరిగే జిల్లాస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ పోటీల్లో ఎంపికయ్యే వారు రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు.