Share News

పెద్దపులి కోసం 322 కెమెరాల ఏర్పాటు

ABN , Publish Date - Mar 12 , 2026 | 02:40 AM

శేషాచల అటవీ ప్రాంతంలో పెద్దపులి ఆచూకీ కనిపెట్టడానికి అటవీశాఖ అధికారులు 322 కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా మూడు దశల్లో జరిగే జాతీయపులుల గణన తొలి దశ జనవరిలో జరిగింది.

పెద్దపులి కోసం 322 కెమెరాల ఏర్పాటు

తిరుపతి(కపిలతీర్థం), మార్చి 11(ఆంధ్రజ్యోతి): శేషాచల అటవీ ప్రాంతంలో పెద్దపులి ఆచూకీ కనిపెట్టడానికి అటవీశాఖ అధికారులు 322 కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. దేశవ్యాప్తంగా మూడు దశల్లో జరిగే జాతీయపులుల గణన తొలి దశ జనవరిలో జరిగింది. మొదటిదశలో పులి సంచరించే ప్రాంతంలో వాటి పాదముద్రలు, వెంట్రుకలు, మలమూత్రాలు సేకరించిన అటవీశాఖ సిబ్బంది నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వుకు పంపారు. ఏప్రిల్‌లో రెండవ దశ టైగర్‌ సెన్సెస్‌ ప్రారంభం కానుంది. ఇందులో తిరుపతి జిల్లాలో 161 పాయింట్లను అటవీశాఖ గుర్తించింది. ఒక్కొక్క పాయింట్‌లో రెండు కెమెరాల చొప్పున 322 ఏర్పాటు చేయనున్నారు. ఈ కెమెరాలు కొద్దిరోజుల పాటు ఉంచిన అనంతరం నాగార్జునసాగర్‌ టైగర్‌ రిజర్వ్‌కు పంపుతారు. అవసరమనుకుంటే మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేస్తామని తిరుపతి రేంజ్‌ ఆఫీసర్‌ సుదర్శన రెడ్డి తెలిపారు.

Updated Date - Mar 12 , 2026 | 02:40 AM