బోయకొండలో 24 మంది జూదరుల అరెస్టు
ABN , Publish Date - Aug 24 , 2026 | 12:29 AM
ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండలో ఆదివారం 24మంది జూదరులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5లక్షలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆ వివరాలను మదనపల్లె డీఎస్పీ బుచ్చిరాజు మీడియాకు వివరించారు.
- రూ.5లక్షల నగదు సీజ్
చౌడేపల్లె, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండలో ఆదివారం 24మంది జూదరులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5లక్షలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఆ వివరాలను మదనపల్లె డీఎస్పీ బుచ్చిరాజు మీడియాకు వివరించారు. బోయకొండ భవానీనగర్‌లో నిర్వహిస్తున్న జూదం స్థావరంపై రహస్య సమాచారం మేరకు పుంగనూరు రూరల్ ఎస్‌ఐ చిన్నరెడ్డెప్ప తన సిబ్బందితో దాడి చేశారు. సత్యసాయి, అనంతపురం, కడప జిల్లాలకు చెందిన ఆదినారాయణ, పాలెం హరీష్, సాకే జయచంద్ర, షేక్ సమీవుల్లా, కొమ్మిగాని భాస్కర, రామాంజనేయులు, వీరనారప్ప, మల్లెపూల సురేష్, సురేంద్రరెడ్డి, గంగరాజు, సురేష్, మస్తాన్, నాగరాజరెడ్డి, రవి, సాంబశివుడు, రాము, వెంకటనారాయణరెడ్డి, శివయ్య, ముస్కిన్, కాటం సత్యప్ప, గుజ్జల నడిపి పెద్దన్న, శ్రీకాంత్, గంగాదేవి, రమీజలను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.5.30 లక్షల నగదు, 3 కార్లు, 18 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుళ్లు కేశవరాజు, చంద్రరాజు, కానిస్టేబుల్ మూర్తినాయక్, హోంగార్డు మునిరాజ, జయశంకర్, శ్రీనివాసులు, చలపతి, ఉమెన్ హోంగార్డు ధనలక్ష్మి పాల్గొన్నారు.
పట్టుబడింది వైసీపీ నేత ఇంట్లో..!
జూదరులు పట్టుబడింది వైసీపీ నేతలు శ్రీరాములునాయుడు, మహేష్, అరుణ ఇంట్లో కాగా ఆ విషయం బయటకు రాకుండా పోలీసులు డిష్ సూరి ఇంటి వెనుకాల అని చెప్పడం విమర్శలకు తావిచ్చింది. ఈ విషయమై పోలీసులను సంప్రదిస్తే సమాధానం దాటవేశారు. బోయకొండలో గతంలోనూ జూదం ఆడుతుండగా రూ.13 లక్షలు సీజ్ చేశారు. వైసీపీ నేతలకు చెందిన గదుల్లో టీడీపీ నేతల అండతోనే జూదం ఆడుతున్నట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు.