Share News

కూటమి ఖాతాలోకి 20.. వైసీపీకి 4

ABN , Publish Date - Nov 20 , 2026 | 03:01 AM

జిల్లాలోని 25 మండల పరిషత్‌లలో కూటమి 20 స్థానాలను దక్కించుకుంది. వైసీపీ 4 స్థానాలను గెలుచుకుంది. 18 వైస్‌ చైర్మన్‌ స్థానాలను టీడీపీ, రెండు జనసేన, నాలుగు వైసీపీ దక్కించుకున్నాయి. రామసముద్రం మండలంలో ఉన్న 14 స్థానాలలో కూటమి, వైసీపీ చెరో 7 స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో ఎంపీపీ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఏం జరిగిందో? ఏమో వైసీపీకి చెందిన ఓ ఎంపీటీసీ సభ్యుడు ఎన్నికకు రాలేదు. విషయం తెలుసుకున్న మిగిలిన వైసీపీ ఎంపీటీసీ సభ్యులు ఎన్నికకు రాలేదు. దీంతో ఏడుగురు సభ్యులతో కోరం ఉండటంతో టీడీపీకి చెందిన విజయకుమార్‌ గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

కూటమి ఖాతాలోకి 20..   వైసీపీకి 4

- ములకలచెరువు ఎన్నిక వాయిదా

అన్నమయ్య, నవంబర్‌ 19(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని 25 మండల పరిషత్‌లలో కూటమి 20 స్థానాలను దక్కించుకుంది. వైసీపీ 4 స్థానాలను గెలుచుకుంది. 18 వైస్‌ చైర్మన్‌ స్థానాలను టీడీపీ, రెండు జనసేన, నాలుగు వైసీపీ దక్కించుకున్నాయి. రామసముద్రం మండలంలో ఉన్న 14 స్థానాలలో కూటమి, వైసీపీ చెరో 7 స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో ఎంపీపీ పదవిపై ఉత్కంఠ నెలకొంది. ఏం జరిగిందో? ఏమో వైసీపీకి చెందిన ఓ ఎంపీటీసీ సభ్యుడు ఎన్నికకు రాలేదు. విషయం తెలుసుకున్న మిగిలిన వైసీపీ ఎంపీటీసీ సభ్యులు ఎన్నికకు రాలేదు. దీంతో ఏడుగురు సభ్యులతో కోరం ఉండటంతో టీడీపీకి చెందిన విజయకుమార్‌ గౌడ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిమ్మనపల్లెలోనూ కూటమి అభ్యర్థే ఎంపీపీగా గెలుస్తారని అనుకున్నారు. ఇక్కడ 9 ఎంపీటీసీ స్థానాలలో 5 వైసీపీ, 4 టీడీపీ గెలుచుకుంది. ఎలాగైనా ఎంపీపీ పదవిని దక్కించుకోవాలని టీడీపీ పథకం వేసింది. అయితే రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి స్వయంగా ఎన్నిక కేంద్రానికి వ చ్చి తమ సభ్యులు ఐదుగురికి ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ముందు ఉంచి ఎంపీపీ పదవిని వైసీపీ అభ్యర్ధి రౌతు లక్ష్మీదేవికి దక్కించుకున్నారు.

రెబల్స్‌తో ములకలచెరువు ఎన్నిక వాయిదా

ములకలచెరువు ఎంపీపీ ఎన్నిక రెబల్‌ కారణంగా వాయిదా పడింది. 13 స్థానాలకు 11 ఎంపీటీసీలు చేతిలో ఉండి.. దర్జాగా ఎంపీపీ కుర్చీని దక్కించుకోవాల్సి ఉండగా పార్టీలో వర్గపోరు కారణంగా శు క్రవారానికి వాయిదాపడింది. పార్టీ విప్‌ జారీ చేసినా క్యాంపులోని ఎంపీటీసీలు గురుఎంపీపీ ఎన్నికకు హాజరుకాలేదు. మండలంలో 13 ఎంపీటీసీ స్ధానాలు ఉండగా అందులో టీడీపీకి చెందిన ఎనిమిది మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన ఐదు స్థానాల్లో ఎన్నికలు జరగ్గా ముగ్గురు టీడీపీ అభ్యర్ధులు, జనసేన, వైసీపీ అభ్యర్ధులు ఒక్కొక్కరు చొప్పున గెలుపొందారు. ఎంపీపీ పదవికి ములకలచెరువు ఎంపీటీసీ కట్టా దొరస్వామినాయుడు, ములకలచెరువు-2 ఎంపీటీసీ పాలగిరి సిద్ధా మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పాలగిరి సిద్ధా ఏడుగురు ఎంపీటీసీలను క్యాంపునకు తరలించారు. ఎంపీటీసీలను ఏకగ్రీవం చేసిన కట్టా దొరస్వామినాయుడిని ఎంపీపీ పదవికి అధిష్ఠానం ఎంపిక చేసింది. గురువారం జరిగిన ఎన్నికకు దొరస్వామినాయుడు, చాంద్‌బాషా, భవానీ, శ్యామలమ్మ మాత్రమే హాజరయ్యారు. క్యాంపులో ఉన్న ఎనిమిది మంది ఎంపీటీసీలు ఎన్నికకు హాజరుకాలేదు. పార్టీ జారీ చేసిన బీ - ఫారంను కట్టా దొరస్వామినాయుడు రిటర్నింగ్‌ అధికారి కళ్యాణ్‌ వెంకటే్‌షకు అందజేశారు.

కుదరని రాజీ యత్నాలు

వాస్తవానికి దొరస్వామి, పాలగిరి సిద్దా మధ్య ఎంపీపీ పదవి విషయమై వివాదం రేగడంతో నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ శంకర్‌యాదవ్‌, పార్టీలోని ఇతర ముఖ్యులు ఇద్దరి మధ్య రాజీ చేసి చెరో రెండున్నర సంవత్సరాలు ఈ పదవిలో ఉండేటట్లు ఒప్పించాలని చూశారు. అయితే పాలగిరి సిద్దా ఇందుకు అంగీకరించలేదు. పాలగిరి సిద్దా వ్యవహారాన్ని సీరియ్‌సగా పరిగణించిన మంత్రి లోకేశ్‌ ఈ విషయమై జోనల్‌ కోఆర్డినేటర్‌ దామచెర్ల సత్యతో మాట్లాడినట్లు తెలిసింది. ఆయన ఆదేశాల మేరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్‌బాబు ములకలచెరువు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - Nov 20 , 2026 | 03:01 AM