కాణిపాకం ఆలయానికి 18.60 ఎకరాలు
ABN , Publish Date - Feb 25 , 2026 | 02:21 AM
కూటమి ప్రభుత్వం కాణిపాక ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే టీటీడీ ద్వారా ఆలయ అభివృద్ధికి రూ.25 కోట్లను కేటాయించింది. ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ అమలుకు కసరత్తు చేస్తోంది. తాజాగా ఆలయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 18.60 ఎకరాలను కేటాయించింది. దీనికి మంగళవారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తవణంపల్లె మండలం పట్నం గ్రామంలో సర్వే నెంబరు 772/1లో 10.44 ఎకరాలు, 772/19లో 8.16 ఎకరాలు చొప్పున మొత్తం 18.60 ఎకరాల భూమిని కేటాయించారు. మార్కెట్ విలువ ఎకరాకు రూ.8.75 లక్షలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తు అవసరాలు, ఆలయ అభివృద్ధి కోసం వినియోగించడంతో పాటు ధ్యాన మందిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
ధ్యాన మందిరంతో పాటు ఇతర భవిష్యత్తు అవసరాలకు..
ఎస్‌ఆర్‌పురంలో మహిళా డిగ్రీ కాలేజీ
మంత్రివర్గం ఆమోదం
చిత్తూరు, ఫిబ్రవరి 24 (ఆంధ్రజ్యోతి): కాణిపాకం ఆలయానికి 18.60 ఎకరాలను కేటాయించడంతో పాటు ఎస్‌ఆర్‌పురం మండలంలో మహిళా డిగ్రీ కాలేజీని మంజూరు చేస్తూ మంగళవారం జరిగిన క్యాబినేట్ మీటింగులో నిర్ణయం తీసుకున్నారు.
కూటమి ప్రభుత్వం కాణిపాక ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించింది. ఇప్పటికే టీటీడీ ద్వారా ఆలయ అభివృద్ధికి రూ.25 కోట్లను కేటాయించింది. ఎమ్మెల్యే మురళీమోహన్ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ అమలుకు కసరత్తు చేస్తోంది. తాజాగా ఆలయ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని 18.60 ఎకరాలను కేటాయించింది. దీనికి మంగళవారం మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తవణంపల్లె మండలం పట్నం గ్రామంలో సర్వే నెంబరు 772/1లో 10.44 ఎకరాలు, 772/19లో 8.16 ఎకరాలు చొప్పున మొత్తం 18.60 ఎకరాల భూమిని కేటాయించారు. మార్కెట్ విలువ ఎకరాకు రూ.8.75 లక్షలు చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతాన్ని భవిష్యత్తు అవసరాలు, ఆలయ అభివృద్ధి కోసం వినియోగించడంతో పాటు ధ్యాన మందిరం ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
వేద పాఠశాల కూడా...
మాస్టర్ ప్లాన్ అమల్లో భాగంగా కాణిపాక ఆలయాన్ని భారీ మార్పులతో అభివృద్ధి చేయనున్నాం. ఇప్పటికే టీటీడీ నుంచి రూ.25 కోట్లను తెచ్చాం. దాతల ద్వారా కూడా ప్రత్యేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. పాలనాపరమైన సంస్కరణలు తెచ్చాం. గోశాల ఏర్పాటు చేయనున్నాం. వేద పాఠశాలను సీఎం ఆమోదించారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.
- మురళీమోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే
యువగళం పాదయాత్ర 200 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా కార్వేటినగరం మండలం కత్తెరపల్లెలో నారా లోకేశ్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. స్థానికుల డిమాండ్ మేరకు అధికారంలో వచ్చాక జీడీనెల్లూరు నియోజకవర్గంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తామని హామీనిచ్చారు. దానికి అనుగుణంగా ఎస్‌ఆర్‌పురం మండలంలో ఏర్పాటు చేసేందుకు మంగళవారం క్యాబినేట్ నిర్ణయం తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి తరగతులు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇక్కడి హైస్కూల్ భవనాల్లోనే తాత్కాలికంగా తరగతుల్ని నిర్వహించనున్నారు. 30 కిలోమీటర్ల పరిధిలో మహిళా కాలేజీ లేని సమస్యకు పరిష్కారం లభించినట్లైంది.
5 ఎకరాల్లో డిగ్రీ కాలేజీ
మాది వెనుబడిన నియోజకవర్గం. విద్యాసంస్థలన్నీ తిరుపతి, చిత్తూరు ప్రాంతాలకే పరిమితమయ్యాయి. మా ప్రాంతంలో మహిళా డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు ప్రయత్నించాను. పాదయాత్రలో మాటిచ్చిన నారా లోకేశ్‌కు పలుమార్లు గుర్తు చేశాను. వచ్చిన అధికారుల బృందానికి హైస్కూల్‌కు చెందిన 5 ఎకరాల ఖాళీ స్థలాన్ని చూపించాను. వచ్చే విద్యాసంవ్సరం నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఆ ఐదు ఎకరాల్లో సొంత భవనాల్ని నిర్మిస్తాం.
- థామస్, జీడీనెల్లూరు ఎమ్మెల్యే