Share News

జడ్పీటీసీలకు 181 ఎంపీటీసీలకు 2172

ABN , Publish Date - Oct 24 , 2026 | 12:52 AM

జిల్లాలో ‘పరిషత్‌’ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. అక్టోబరు 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు నామినేషన్లను స్వీకరించగా.. 27 జడ్పీటీసీ స్థానాలకు 181.. 370 ఎంపీటీసీ స్థానాలకు 2172 నామినేషన్లు దాఖలయ్యాయి.

జడ్పీటీసీలకు 181 ఎంపీటీసీలకు 2172
చిత్తూరులో నామినేషన్‌ వేయడానికి వస్తున్న జడ్పీటీసీ అభ్యర్థులు

ముగిసిన నామినేషన్ల స్వీకరణ

చిత్తూరు, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ‘పరిషత్‌’ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. అక్టోబరు 21 నుంచి 23వ తేదీ వరకు మూడు రోజుల పాటు నామినేషన్లను స్వీకరించగా.. 27 జడ్పీటీసీ స్థానాలకు 181.. 370 ఎంపీటీసీ స్థానాలకు 2172 నామినేషన్లు దాఖలయ్యాయి. జడ్పీటీసీ స్థానాలకు చివరి రోజైన శుక్రవారం అధికంగా 84 నామినేషన్లు వచ్చాయి. పార్టీల వారీగా చూస్తే టీడీపీ నుంచి 73, వైసీపీ 59, జనసేన 16, కాంగ్రెస్‌ 14, బీఎస్పీ 7, బీజేపీ మూడు, ఇతర పార్టీల నుంచి 2, స్వతంత్ర అభ్యర్థులుగా ఏడుగురు నామినేషన్లు వేశారు. మండలాల వారీగా చూసుకుంటే ఐరాలలో అత్యధికంగా 12, బంగారుపాళ్యం, యాదమరిలో స్వల్పంగా మూడు చొప్పున నామినేషన్లు దాఖలయ్యాయి.

ఫ ఇక, ఎంపీటీసీ స్థానాల విషయానికొస్తే మొత్తం 2172 నామినేషన్లు దాఖలవ్వగా, చివరి రోజు శుక్రవారమే 1158 రావడం విశేషం. పార్టీల వారీగా చూసుకుంటే టీడీపీ నుంచి 1072, వైసీపీ 854, జనసేన 102, స్వతంత్రులు 76, బీజేపీ 31, కాంగ్రెస్‌ 20, బీఎస్పీ 7, సీపీఐ-ఎం 1, ఇతర పార్టీలకు 9 మంది నామినేషన్లు వేశారు. వి.కోట మండలంలో అత్యధికంగా 143, శాంతిపురంలో 121 దాఖలయ్యాయి.

Updated Date - Oct 24 , 2026 | 12:52 AM