Share News

శ్రీకాళహస్తి పురపోరుకు తొలిరోజు 17 నామినేషన్లు

ABN , Publish Date - Nov 15 , 2026 | 01:02 AM

శ్రీకాళహస్తి పురపాలక ఎన్నికలకు సంబంధించి తొలి రోజు 17 నామినేషన్లు దాఖలయ్యాయి.చైర్మన్‌ స్థానానికి సీపీఎం తరపున ఒక నామినేషన్‌,వార్డు కౌన్సిలర్ల స్థానాలకు టీడీపీ తరపున 5, బీజేపీ నుంచి 3, వైసీపీ నుంచి 7, సీపీఎం నుంచి ఒక నామినేషన్‌ చొప్పున దాఖలైనట్లు కమిషనర్‌ కేవీ కృష్ణారెడ్డి వెల్లడించారు.

శ్రీకాళహస్తి పురపోరుకు తొలిరోజు 17 నామినేషన్లు

శ్రీకాళహస్తి, నవంబరు 14(ఆంధ్రజ్యోతి): శ్రీకాళహస్తి పురపాలక ఎన్నికలకు సంబంధించి తొలి రోజు 17 నామినేషన్లు దాఖలయ్యాయి.చైర్మన్‌ స్థానానికి సీపీఎం తరపున ఒక నామినేషన్‌,వార్డు కౌన్సిలర్ల స్థానాలకు టీడీపీ తరపున 5, బీజేపీ నుంచి 3, వైసీపీ నుంచి 7, సీపీఎం నుంచి ఒక నామినేషన్‌ చొప్పున దాఖలైనట్లు కమిషనర్‌ కేవీ కృష్ణారెడ్డి వెల్లడించారు. ఆర్డీవో భానుప్రకా్‌షరెడ్డి, డీఎస్పీ పావని నామినేషన్ల ప్రక్రియను పర్యవేక్షించారు.

చైర్మన్‌ అభ్యర్థులపై వీడని ఉత్కంఠ

శ్రీకాళహస్తి మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి విషయంలో ఇంకా ఉత్కంఠ వీడలేదు. చైర్మన్‌ స్థానాన్ని బీసీ జనరల్‌కు కేటాయించిన విషయం తెలిసిందే. కూటమి సీట్ల సర్దుబాటులో భాగంగా చైర్మన్‌ స్థానం టీడీపీకి లభించింది. టీడీపీలో బలమైన నాయకుల నుంచి పెద్దఎత్తున పోటీ నెలకొంది. దీంతో పార్టీ అధిష్ఠానం వివిధ సమీకరణాలను పరిశీలిస్తూ సమర్థవంతమైన అభ్యర్థిని ఎంపిక చేసేందుకు మూడురోజుల నుంచి ఐవీఆర్‌ఎస్‌ సర్వే చేపట్టింది. మొదట నలుగురి పేర్లతో సర్వే నిర్వహించింది.తరువాత అందులో నుంచి రెండుపేర్లతో శనివారం మరోదఫా సర్వే నిర్వహించింది.అయితే అభ్యర్థి ఎవరన్నది శనివారం రాత్రి వరకు కూడా తెలియలేదు. టీడీపీ నుంచి అభ్యర్థి ఖరారు కాకపోవడంతో వైసీపీ కూడా తమ అభ్యర్థి వేటను కొనసాగిస్తూనే ఉంది.

Updated Date - Nov 15 , 2026 | 01:02 AM