కొత్త ఓటర్లకోసం 14,020 దరఖాస్తులు
ABN , Publish Date - Sep 12 , 2026 | 01:36 AM
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో కీలక ఘట్టం ముగిసింది. ఓటర్ల నుంచి అభ్యంతరాలు సీక్వరణతోపాటు కొత్త ఓటర్ల నమోదు, చిరునామాలో మార్పునకు నిర్దేశించిన గడువు గురువారంతో ముగిసింది.
తిరుపతి(కలెక్టరేట్), సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో కీలక ఘట్టం ముగిసింది. ఓటర్ల నుంచి అభ్యంతరాలు సీక్వరణతోపాటు కొత్త ఓటర్ల నమోదు, చిరునామాలో మార్పునకు నిర్దేశించిన గడువు గురువారంతో ముగిసింది. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల పరిధిలో 2221 పోలింగ్‌కేంద్రాల్లో ఓటర్ల నుంచి అభ్యంతరాలు, కొత్తఓటర్ల నమోదుకు దరఖాస్తులు తీసుకున్నారు. సర్ ప్రక్రియలో తొలగించిన ఓటర్లతోపాటు కొత్తగా ఓటరు నమోదు కోసం జిల్లాలో 14,020 ఫారం-6 దరఖాస్తులు వచ్చాయి. వాటిని విచారణ చేసేందుకు నియోజకవర్గాలవారీగా కలెక్టర్ వెంకటేశ్వర్ ఆద్వర్యంలో చర్యలు చేపట్టారు. కొత్త ఓటరు కోసం దరఖాస్తుచేసుకున్న వారి స్వగ్రామంలో బీఎల్వోలు విచారణచేసే ప్రక్రియ చేపట్టారు. తొలగింపుల కోసం ఫారం-7కు 369, చిరునామాల మార్పు,చేర్పులకు ఫారం 8కు 8,924 వచ్చాయి. అక్టోబరు 5తేదీ వరకు ఓటర్ల క్లైయిమ్స్ పరిష్కరించి.. 9న తుదిఓటర్ల జాబితాను ప్రకటిస్తారు.