1.35 లక్షల ఓట్లు పోయినటే!
ABN , Publish Date - Jul 25 , 2026 | 01:58 AM
జిల్లాలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో 1.35 లక్షల ఓట్లు తొలగిపోనున్నాయి. 1,35,529 ఓటర్ల వివరాలను సేకరించడానికి వీలు లేనివిగా (అన్‌కలెక్టబుల్) అధికారులు గుర్తించారు. వీరిలో అందుబాటులో లేనివారు, మరణించినవారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిపోయినవారు ఉన్నారు.
చెల్లుబాటుకాని ఖాతాలో 10 శాతం
42 వేల మంది మృతులు
55 వేల మంది శాశ్వత వలసదారులు
ఇప్పటికే మరోచోట పేర్లున్నవారు 19 వేల మంది
ముగిసిన సర్-2026 ప్రక్రియ
చిత్తూరు, ఆంధ్రజ్యోతి
జిల్లాలో ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన క్షేత్రస్థాయి పరిశీలనలో 1.35 లక్షల ఓట్లు తొలగిపోనున్నాయి. 1,35,529 ఓటర్ల వివరాలను సేకరించడానికి వీలు లేనివిగా (అన్‌కలెక్టబుల్) అధికారులు గుర్తించారు. వీరిలో అందుబాటులో లేనివారు, మరణించినవారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా వలస వెళ్లిపోయినవారు ఉన్నారు.
జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో 13,40,126 మంది ఓటర్లు ఉండగా, వారిలో 10.12 శాతం మంది ఓటర్ల వివరాలు చెల్లుబాటు కాకుండా పోయాయి. జిల్లా వ్యాప్తంగా 42192 మంది ఓటర్లు మరణించినట్లుగా నిర్ధారించారు. 55199 మంది వేరే ప్రాంతాలకు శాశ్వతంగా నివాసం మార్చినవారున్నారు. ఇళ్ల వద్ద అందుబాటులో లేని, ఊర్లో లేని ఓటర్లు 19085 మంది ఉన్నట్లు తేలింది. ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉన్న కేసుల్ని 19009 వరకు గుర్తించారు. ఇక, నియోజకవర్గాల వారీగా పరిశీలిస్తే, అత్యధికంగా పలమనేరులో 29354 ఓట్లు అన్‌కలెక్టబుల్‌గా తేలాయి. వీటిలో 15728 మంది శాశ్వతంగా వలస వెళ్లినవారే కావడం గమనార్హం. ఆ తర్వాత చిత్తూరు నియోజకవర్గంలో 26327 ఓట్లు, కుప్పంలో 24795 ఓట్లు, నగరిలో 20725 ఓట్లు, పూతలపట్టులో 19904 ఓట్లు, జీడీనెల్లూరులో 14424 ఓట్లు పోనున్నాయి.
మిగిలింది 5 కేసులే
మొత్తం 12,04,503 మంది ఓటర్ల వివరాలను డిజిటలైజ్ చేశారు. ఏఎ్‌సడీ పరిశీలనలో మూడు కేసులు (నగరిలో 2, పలమనేరులో 1), డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీస్ పరిశీలనలో మరో 2 కేసులు (చిత్తూరు, కుప్పంలో ఒక్కోటి) మాత్రమే పెండింగులో ఉన్నాయి. కాగా, శుక్రవారం అర్ధరాత్రి 12 గంటలకు ‘సర్’ కార్యక్రమం ముగిసింది.
సర్.. ఓటర్ల గణాంకాలిలా
నియోజకవర్గం మొత్తం అన్‌కలెక్టబుల్ డెత్ గైర్హాజరు శాశ్వత వలస
నగరి 203693 20725 6875 5115 6571
జీడీనెల్లూరు 207342 14424 6295 1194 4213
చిత్తూరు 203536 26327 5721 4173 12383
పూతలపట్టు 222755 19904 7739 1736 7445
పలమనేరు 272326 29354 8856 627 15728
కుప్పం 230474 24795 6706 6240 8849
మొత్తం 1340126 135529 42192 19085 55199