లోక్ అదాలత్ ద్వారా 12829 కేసుల పరిష్కారం
ABN , Publish Date - Jul 12 , 2026 | 01:28 AM
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్ ద్వారా 12,829 కేసులు పరిష్కారమయ్యాయి. వాయల్పాడులో 84, తిరుపతి 2808, తంబళ్ళపల్లి 76, శ్రీకాళహస్తి 669, సత్యవేడు 1212, పుత్తూరు 1335, పుంగనూరు 18, పీలేరు 1327, పలమనేరు 1095, పాకాల 553, నగరి 240, మదనపల్లి 1130, కుప్పం 559, చిత్తూరులో 1626 కేసులు పరిష్కారమయ్యాయి.
చిత్తూరు లీగల్, జూలై 11 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో శనివారం జరిగిన జాతీయ లోక్‌అదాలత్ ద్వారా 12,829 కేసులు పరిష్కారమయ్యాయి. వాయల్పాడులో 84, తిరుపతి 2808, తంబళ్ళపల్లి 76, శ్రీకాళహస్తి 669, సత్యవేడు 1212, పుత్తూరు 1335, పుంగనూరు 18, పీలేరు 1327, పలమనేరు 1095, పాకాల 553, నగరి 240, మదనపల్లి 1130, కుప్పం 559, చిత్తూరులో 1626 కేసులు పరిష్కారమయ్యాయి. చిత్తూరులో జాతీయ లోక్ అధాలత్‌ను జిల్లా న్యాయమూర్తి అరుణ సారిక ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజీమార్గమే రాజ మార్గమన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు ఐక్యమత్యంగా ఉండాలన్నారు. క్షణికావేశానికి గురై భవిష్యత్తును నాశనం చేసుకోకూడదన్నారు. సమస్య వస్తే ఇరువర్గాలు సామరస్యంగా చర్చించుకోవాలన్నారు. లోక్ అదాలత్ కార్యక్రమం ప్రజలకు వరం లాంటిదన్నారు. కేసులు రాజీ చేసుకున్న వారికి ఆమె ధ్రువీకరణపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారులు పాల్గొన్నారు.