ఓటేసిన 105 ఏళ్ల బామ్మ
ABN , Publish Date - Nov 30 , 2026 | 01:35 AM
ఆమె వయసు 105 ఏళ్లు. తన జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశారామె. ఓట్లూ వేశారు. ఈ పంచాయతీ ఎన్నికల్లోనూ ఓటేసేందుకు ఆమె ఉత్సాహం చూపారు.
ఆమె వయసు 105 ఏళ్లు. తన జీవితంలో ఎన్నో ఎన్నికలు చూశారామె. ఓట్లూ వేశారు. ఈ పంచాయతీ ఎన్నికల్లోనూ ఓటేసేందుకు ఆమె ఉత్సాహం చూపారు. ఎందరిలాగానో.. మనం ఓటేయకపోతే ఏమవుతుందని అనుకోలేదు ఐరాల మండలం ముదిగోళం పంచాయతీ పందిగుట్టూరుకు చెందిన మాణిక్యమ్మ(105). ఓటేయడం తన హక్కుగా భావించారామె. ఎగువచవటపల్లెలో ఆదివారం నిర్వహించిన పంచాయతీ ఎన్నికలలో తన ఓటు వేశారు. ఉదయం 10 గంటలకు కారులో వచ్చిన ఆమె.. సహాయకుల ద్వారా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటేయని వాళ్లకు ఆమె స్ఫూర్తిగా నిలిచారు.
- ఐరాల, ఆంధ్రజ్యోతి