Share News

చిత్తూరులో 10.4 సెంటీమీటర్ల వర్షం

ABN , Publish Date - Oct 19 , 2026 | 01:53 AM

ఎండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న చిత్తూరు ప్రజలను వరుణుడు కరుణించాడు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 10.4 సెంటీమీటర్ల భారీవర్షాన్ని కురిపించాడు. జిల్లావ్యాప్తంగా చురుగ్గా ఈశాన్య రుతుపవనాలు కదులుతున్నాయి

చిత్తూరులో 10.4 సెంటీమీటర్ల వర్షం

చిత్తూరు కలెక్టరేట్‌, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి): ఎండలకు ఉక్కిరిబిక్కిరి అవుతున్న చిత్తూరు ప్రజలను వరుణుడు కరుణించాడు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 10.4 సెంటీమీటర్ల భారీవర్షాన్ని కురిపించాడు. జిల్లావ్యాప్తంగా చురుగ్గా ఈశాన్య రుతుపవనాలు కదులుతున్నాయి ఉపరితల ఆవర్తనం కారణంగా జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల భారీవర్షాలు పడ్డాయి. 15వ తేదీవరకు చుక్క వర్షం కురవకపోగా.. 16, 17, 18 తేదీలలో కురిసిన వర్షంతో సరాసరి వర్షపాతం 119.5 మి.మీ నమోదైంది. అక్టోబరు నెల సాధారణ వర్షపాతం 157 మిమీ. కాగా, గడచిన 24 గంటల్లో మండలాల వారీగా.. చిత్తూరులో 104.4 మి.మీ, పాలసముద్రంలో 90.8, వి.కోటలో 80.2, శాంతిపురంలో 78.6, గుడుపల్లెలో 70.2, రామకుప్పంలో 66.2, ఐరాలలో 63.4, బైరెడ్డిపల్లెలో 62.8, యాదమరిలో 60.4, గంగాధరనెల్లూరులో 60.2, పూతలపట్టులో 59.2, బంగారుపాళ్యంలో 58.2, చిత్తూరు రూరల్‌లో 54.0, శ్రీరంగరాజపురంలో 49.2, కుప్పంలో 43.2, నిండ్రలో 35.2, గంగవరంలో 34.2, గుడిపాలలో 30.0, పెనుమూరులో 28.0, వెదురుకుప్పంలో 26.2, పలమనేరులో 25.0, కార్వేటినగరంలో 24.2, విజయపురంలో 22.2, నగరిలో 18.2, పులిచెర్లలో 14.6, పెద్దపంజాణిలో 12.4, రొంపిచెర్లలో 10.6 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది.

Updated Date - Oct 19 , 2026 | 01:53 AM