10.23 లక్షల మంది గ్రామీణ ఓటర్లు
ABN , Publish Date - Nov 14 , 2026 | 01:53 AM
మూడు విడతల్లో జరిగే పంచాయతీ 10,23,257 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. తొలి విడతలో 1928 పోలింగ్ కేంద్రాల్లో 4,17,342 మంది.. రెండో విడతలో 2282 పోలింగ్ కేంద్రాల్లో 3,41,406 మంది.. మూడో విడతలో 1676 పోలింగ్ కేంద్రాల్లో 2,64,509 మంది ఓటర్లు ఉన్నారు.
మూడు విడతల్లో జరిగే పంచాయతీ 10,23,257 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. తొలి విడతలో 1928 పోలింగ్ కేంద్రాల్లో 4,17,342 మంది.. రెండో విడతలో 2282 పోలింగ్ కేంద్రాల్లో 3,41,406 మంది.. మూడో విడతలో 1676 పోలింగ్ కేంద్రాల్లో 2,64,509 మంది ఓటర్లు ఉన్నారు.
తొలివిడత నామినేషన్ల స్వీకరణ ఇలా..
తొలి విడత ఎన్నికల ప్రక్రియ ఆదివారం నుంచి 45 క్లస్టర్లలో నామినేషన్ల స్వీకరణతో ప్రారంభం కానుంది. అత్యధికంగా కుప్పంలో ఏడు, అత్యల్పంగా పలమనేరులో రెండు క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నారు. 1,928 పోలింగ్ కేంద్రాలు తొలి విడతలో ఏర్పాటు చేస్తుండగా, వీటిలో 1-200 లోపు ఓటర్లు ఉన్నవి 941, 201- 400 మధ్య ఓటర్లున్న కేంద్రాలు 860, 401-650 ఓటర్లున్న కేంద్రాలు 122గా గుర్తించారు.
పిల్లలు ఎంత మందైనా ఉండొచ్చు
పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలంటే గతంలో ఇద్దరుకు మించి పిల్లలు ఉండదకూడదనే నిబంధన ఉండేది. అధిక సంతానం ఉండే తల్లిదండ్రులు పోటీకి అనర్హులు. ఈ నిబంధన ప్రకారం అప్పట్లో పలువురి నామినేషన్లనూ తిరస్కరించిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడా నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేసింది. సంతానం సంఖ్యతో నిమిత్తం లేకుండా ఎన్నికల్లో ఎవరైనా పోటీ చేయొచ్చు.
అంతా ఆన్లైన్లో..
అభ్యర్థుల నుంచి స్వీకరించిన నామినేషన్లను ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. పంచాయతీలు, వార్డుల వివరాలు కూడా పొందుపరుస్తారు. ఎన్నికల ఫలితాలను కూడా ఆన్లైన్లో ఉంచుతారు. అన్నీ ఆన్లైన్ చేయడం ద్వారా పారదర్శకతకు పెద్దపీట వేస్తున్నారు. నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద సీసీ కెమెరాల ద్వారా మొత్తం ప్రక్రియను రికార్డు చేస్తారు.
అన్నిచోట్లా వీడియో గ్రాఫింగ్
జిల్లాలో 5,886 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తుండగా... పోలింగ్ ప్రక్రియను వీడియోగ్రఫీ చేసేందుకు చర్యలు చేపట్టారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ చేస్తారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు అన్ని పోలింగ్ కేంద్రాలలో వీడియో చిత్రీకరణ చేపడతారు.
పెద్ద కౌంటింగ్ కేంద్రాలు
గతానుభవాల దృష్ట్యా ఈసారి ఓట్ల లెక్కింపు కేంద్రాలను పెద్దవిగా ఉన్న భవనాలను ఏర్పాటు చేస్తున్నారు. ఆ మేర ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆలస్యం లేకుండా జరిగేలా చర్యలు తీసుకున్నారు. చిన్న పంచాయితీలకు సాయంత్రంలోపే ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. మేజర్ పంచాయతీల్లో ఏదైనా సరే ఆ రోజు రాత్రి కౌంటింగ్ పూర్తిచేసి ఫలితాలు ప్రకటించేలా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.
‘ఆమె’కే ఎక్కువ స్థానాలు
పల్లె పోరులో మహిళలు నిర్ణయాత్మక శక్తిగా నిలవనున్నారు. 617 సర్పంచ్ స్థానాల్లో ఆమెకు 307 స్థానాలు కేటాయించారు. వార్డు స్థానాల్లోనూ 5866 కి 2925 స్థానాలను మహిళలకు రిజర్వు చేశారు. దీంతోపాటు జనరల్ స్థానాల నుంచీ మహిళలు పురుషులతో సమానంగా పోటీచేసే అవకాశం ఉంది.
- చిత్తూరు కలెక్టరేట్, ఆంధ్రజ్యోతి