10కేజీల జింక మాంసం స్వాధీనం
ABN , Publish Date - Sep 09 , 2026 | 01:45 AM
:తలకోన అటవీ ప్రాంతం ఆనుకుని వున్న నెరబైలు పంచాయతీ పరిధిలో వన్య ప్రాణుల వేట జోరుగా సాగుతోంది.డీవైఎ్‌ఫఆర్వో చైతన్య ఆధ్వర్యంలోని ఫారెస్టు సిబ్బంది సుమారు 10 కేజీల జింక మాంసాన్ని స్వాదీనం చేసుకున్నారు
ఎర్రావారిపాలెం ,సెప్టెంబరు 8(ఆంధ్రజ్యోతి):తలకోన అటవీ ప్రాంతం ఆనుకుని వున్న నెరబైలు పంచాయతీ పరిధిలో వన్య ప్రాణుల వేట జోరుగా సాగుతోంది. తుపాకులు, కరెంట్ షాక్‌లతో జింకలను ,పందులను వేటాడుతున్నారు. తాజాగా రమణమ్మ అనే మహిళ ఇంటిపై ఎండబెట్టిన జింక మాంసాన్ని అటవీశాఖ అధికారులు మంగళవారం సాయంత్రం స్వాధీనం చేసుకున్నారు. పులుబోను పల్లెలో కొందరు వ్యక్తులు కరెంట్ తీగలతో వేట సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి రెండు చుక్కల జింకలు కరెంట్ తీగలకు బలయ్యాయి. వేటలో దొరికిన జింకలను కోసి మాంసాన్ని రమణమ్మకు అమ్మినట్లు తెలిసిన వ్యక్తులు ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. డీవైఎ్‌ఫఆర్వో చైతన్య ఆధ్వర్యంలోని ఫారెస్టు సిబ్బంది సుమారు 10 కేజీల జింక మాంసాన్ని స్వాదీనం చేసుకున్నారు.ఈ విషయమై ఎఫ్‌ఆర్వో మాధవిని అడగ్గా సిబ్బంది తనకు చెప్పలేదని తెలిపారు.డీవైఎ్‌ఫఆర్వో చైతన్య మాత్రం నిందితురాలు మహిళ కావడంతో బుధవారం ఉదయం ఫారెస్టుకు తీసుకొస్తామని తెలిపారు.