చికెన్@ 330
ABN , Publish Date - Jan 19 , 2026 | 01:29 AM
కోడి కొండెక్కింది. చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. కిలో రూ 320 నుంచి 330కి చేరింది. గతేడాది కార్తీక మాసంలో కిలో చికెన్ రూ.240 వరకు పలికింది. డిసెంబరు చివరి నాటికి రూ.270 వరకు చేరింది. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో కిలో 290- 300 రూపాయలకు పెరిగింది. అదే కాస్తా మూడో వారం వచ్చేసరికి రూ.320 నుంచి రూ.330 వరకు చేరింది. ఈ ధరల పెరుగుదలతో పది నుంచి 15 శాతం వరకు వ్యాపారంపై ప్రభావం చూపినట్లు అంచనా. కోళ్ల మేత ధరలు పెరగడంతో నిర్వహణ వ్యయం అధికమై కొందరు కోళ్ల పెంపకం ఆపేశారు. దీంతో సుమారు జిల్లాలో 5 నుంచి 6 శాతం వరకు కోళ్ళ పెంపకం తగ్గిపోయిందని నిర్వాహకుడు నారాయణస్వామి చెప్పారు. దీంతో కోళ్ల సరఫరా తగ్గినా.. డిమాండు తగ్గకపోవడంతో ధరలు పెంచారని వ్యాపారి రమేష్ చెప్పారు.
తిరుపతి సిటీ, ఆంధ్రజ్యోతి: కోడి కొండెక్కింది. చికెన్ ధరలు అమాంతం పెరిగాయి. కిలో రూ 320 నుంచి 330కి చేరింది. గతేడాది కార్తీక మాసంలో కిలో చికెన్ రూ.240 వరకు పలికింది. డిసెంబరు చివరి నాటికి రూ.270 వరకు చేరింది. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో కిలో 290- 300 రూపాయలకు పెరిగింది. అదే కాస్తా మూడో వారం వచ్చేసరికి రూ.320 నుంచి రూ.330 వరకు చేరింది. ఈ ధరల పెరుగుదలతో పది నుంచి 15 శాతం వరకు వ్యాపారంపై ప్రభావం చూపినట్లు అంచనా. కోళ్ల మేత ధరలు పెరగడంతో నిర్వహణ వ్యయం అధికమై కొందరు కోళ్ల పెంపకం ఆపేశారు. దీంతో సుమారు జిల్లాలో 5 నుంచి 6 శాతం వరకు కోళ్ళ పెంపకం తగ్గిపోయిందని నిర్వాహకుడు నారాయణస్వామి చెప్పారు. దీంతో కోళ్ల సరఫరా తగ్గినా.. డిమాండు తగ్గకపోవడంతో ధరలు పెంచారని వ్యాపారి రమేష్ చెప్పారు.
తగ్గిన గుడ్డు!
గుడ్ల ఉత్పత్తి తగ్గడం, చలికాలంలో ఈశాన్య, ఉత్తరాది రాష్ట్రాల్లో వీటి వినియోగం ఎక్కువగా ఉండటం, ఈ కారణాలతో కోడిగుడ్ల ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఎన్నడూ లేని విధంగా బహిరంగ మార్కెట్‌లో గుడ్డు రూ.8 వరకు ధర పలికింది. ఇప్పుడు చలి తీవ్రత తగ్గడంతో ఉత్తరాదిన గుడ్డుకు డిమాండ్ తగ్గిందని అంటున్నారు. ప్రస్తుతం గుడ్డు రూ.6.50 వరకు ధర ఉంది. ఇది వినియోగదారులకు ఊరటనిచ్చే అంశం. గుడ్డు ఉత్పత్తికి రూ.5.50 ఖర్చవుతోందని, ఇక ట్రేడర్లకు కమీషను 25 పైసల వరకు ఉంటుందని, ఇదంతా పోను మిగిలేది పెద్దగాలేదని ఉత్పత్తిదారులు అంటున్నారు.