Share News

ఎండ.. ఆపై చినుకులు

ABN , Publish Date - May 04 , 2026 | 01:54 AM

జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. వేడి సెగలతో కూడిన గాలులు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఒక్కసారిగా గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరగడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం చిత్తూరు నగరంలో చాలా రోడ్లు, ముఖ్య కూడళ్లు జనం లేక బోసిపోయాయి. గంగవరం, పలమనేరు, పెద్ద పంజాణి మండలాలు ఆరెంజ్‌ జోన్‌లో చేరాయి.

 ఎండ.. ఆపై చినుకులు
చిత్తూరులో ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఓవైపు ఎండ కాస్తూనే.. మరోవైపు పడుతున్న చినుకులు ఎండ.. ఆపై చినుకులు

చిత్తూరు కలెక్టరేట్‌, మే 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. వేడి సెగలతో కూడిన గాలులు, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఒక్కసారిగా గత వారం రోజులుగా పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరగడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు భయపడే పరిస్థితి నెలకొంది. ఆదివారం మధ్యాహ్నం చిత్తూరు నగరంలో చాలా రోడ్లు, ముఖ్య కూడళ్లు జనం లేక బోసిపోయాయి. గంగవరం, పలమనేరు, పెద్ద పంజాణి మండలాలు ఆరెంజ్‌ జోన్‌లో చేరాయి. అత్యధికంగా తవణంపల్లెలో 43.8, పలమనేరులో 43.5, నిండ్రలో 43.4, నగరిలో 43.2 డిగ్రీల ఉష్ణోగ్రత చేరింది. మండలాల వారీగా పెద్దపంజాణి 42.8, విజయపురం 42.9, గంగాధరనెల్లూరు, ఎస్‌ఆర్‌పురంలో 42.5, గంగవరం 42.4, పెనుమూరు, వెదురుకుప్పంలో 42.3, పూతలపట్టు 42.2, పాలసముద్రం 41.9, చిత్తూరు రూరల్‌, అర్బన్‌, గుడిపాల, యాదమరిలో 41.8, ఐరాలలో 41.5, బంగారుపాళ్యంలో 41.4, పులిచెర్ల, రొంపిచెర్లలో 41.1, రామకుప్పం, శాంతిపురంలో 40.9, కార్వేటినగరంలో 40,4, బైరెడ్డిపల్లెలో 39.8, కుప్పంలో 38.5, వీకోటలో 37.9, గుడుపల్లెలో 37.7డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సాయంత్రానికి చిత్తూరులో తుంపర్లతో వాన పడింది.

రెండు మండలాల్లో వర్షం

అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా తేలికపాటి వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు నగరంలో సాయంత్రం తేలికపాటి వర్షం కురవడంతో భానుడి సెగ తగ్గింది. ఆహ్లాదం పెరిగింది. మండలాల వారీగా కార్వేటినగరంలో 16.2, చిత్తూరు అర్బన్‌లో 1.4 మిమీ వర్షం కురిసింది.

Updated Date - May 04 , 2026 | 01:54 AM