బెజవాడలో పేదలకు పట్టాభిషేకం
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:42 AM
విజయవాడ నగరంతోపాటు ఎన్టీఆర్ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న పేదల ఇళ్ల పట్ట్టాల క్రమబద్ధీకరణపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
24 వేల మందికి భూమిపై హక్కులు.. 30న పట్టాల పంపిణీ
(ఆంధ్రజ్యోతి-విజయవాడ): విజయవాడ నగరంతోపాటు ఎన్టీఆర్ జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న పేదల ఇళ్ల పట్ట్టాల క్రమబద్ధీకరణపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పేదలు నివసిస్తున్న భూమిపై వారికి సర్వ హక్కులూ కల్పించేలా నిరభ్యంతర పట్టాలను మంజూరు చేస్తోంది. ఈ నెల 30వ తేదీన సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఈ పట్టాభిషేకం జరగనుంది. ఇటీవల విశాఖపట్నంలో భారీ సంఖ్యలో పేదలకు ఇళ్ల పట్టాలను సీఎం అందజేశారు. అదే స్థాయిలో విజయవాడలోనూ పండుగ వాతావరణంలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలోని 24,057 మంది నిరుపేదలు వారి నివేశన స్థలాలపై సర్వహక్కులు పొందనున్నారు. మొత్తం రూ.24,297 కోట్ల మార్కెట్ విలువైన ఆస్తికి పేదలు హక్కుదారులు కానున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
మత్స్యకార కుటుంబాలకు 50 కేజీల ఉచిత బియ్యం.. సీఎం చంద్రబాబు ఆదేశాలు