Share News

నెలకు రూ.2వేల కోట్ల పనులు జరగాలి

ABN , Publish Date - Oct 07 , 2026 | 05:16 AM

రాజధాని అమరావతిలో నెలకు రూ.2వేల కోట్ల విలువైన పనులు జరిగేలా ప్రణాళికతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం అమరావతి పనులపై క్యాంపు కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ఆయన నెలవారీ సమీక్ష నిర్వహించారు.

నెలకు రూ.2వేల కోట్ల పనులు జరగాలి

  • ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు పట్టాలెక్కించండి: సీఎం

అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో నెలకు రూ.2వేల కోట్ల విలువైన పనులు జరిగేలా ప్రణాళికతో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. మంగళవారం అమరావతి పనులపై క్యాంపు కార్యాలయంలో అధికారులు, కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో ఆయన నెలవారీ సమీక్ష నిర్వహించారు. రాజధాని పరిధిలో చేపట్టిన 152 ప్రాజెక్టుల్లో 41వేల మంది కార్మికులు పనిచేస్తున్నారని మంత్రి నారాయణ తెలిపారు. పనుల పురోగతిని, ఆయా ప్రాజెక్టుల స్థితిగతులను అధికారులు వివరించారు. గత నెలలో రూ.1,345 కోట్ల విలువైన పనులు చేసినట్లు చెప్పారు. వీటిని రూ.2వేల కోట్లకు తీసుకెళ్లాలని, రాజధాని నిర్మాణంతో పాటు కేంద్రం సమన్వయంతో ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టును పట్టాలెక్కించాలని సీఎం సూచించారు.

ఈ వార్తలనూ చదవండి..

అమరావతి పనుల్లో వేగం పెంచాలి.. ప్రతి నెల రూ. 2వేల కోట్ల పనులు పూర్తి చేయాలి: సీఎం

స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పోటీ చేసే స్థానాలు ఖరారు..!

Updated Date - Oct 07 , 2026 | 05:16 AM