Share News

వీధిలోని సిమెంట్‌ రోడ్డే సరిహద్దు!

ABN , Publish Date - Nov 23 , 2026 | 05:53 AM

: ఆ ఊరిలో సిమెంటు రోడ్డుకు అటూ ఇటూ ఇళ్లున్నాయి! కొత్తగా వెళ్లినవారు అదంతా ఒకే గ్రామమని అనుకుంటటారు

వీధిలోని సిమెంట్‌ రోడ్డే సరిహద్దు!
cc

  • పక్కపక్కనే ఉన్నా వేర్వేరు మండలాల్లో 2 గ్రామాలు

కాశినాయన, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆ ఊరిలో సిమెంటు రోడ్డుకు అటూ ఇటూ ఇళ్లున్నాయి! కొత్తగా వెళ్లినవారు అదంతా ఒకే గ్రామమని అనుకుంటటారు.. కానీ.. అవి రెండు వేర్వేరు మండలాలకు చెందిన రెండు గ్రామాలు కావడం విశేషం. ఇదీ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలోని కలసపాడు, కాశినాయన మండలాలకు చెందిన చెన్నారెడ్డిపల్లె, పిట్టిగుంట ప్రత్యేకత. అంటే సిమెంట్‌ రోడ్డే ఆ రెండు గ్రామాలకు, వాటి మండలాలకు సరిహద్దు. పేరుకే రెండు గ్రామాలైనప్పటికీ అంతా కలిసే ఉంటారు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం 820 మంది ఓటర్లున్న చెన్నారెడ్డిపల్లె గ్రామం (పెండ్లిమర్రి పంచాయతీ) సర్పంచ్‌ పదవి ఎస్సీకి రిజర్వు అయింది. ఇక్కడ ఇరుపార్టీల మద్దతుదారులు పోటీలో ఉన్నా ఎలాంటి ఎన్నికల సందడి కానరావడంలేదు. పక్కనే సిమెంటు రోడ్డుకు ఆవల.. 547 మంది ఓటర్లున్న పిట్టిగుంట (రంపాడు పంచాయతీ) సర్పంచ్‌ పదవి ఓసీ జనరల్‌ కావడంతో ఎన్నికల సందడి కనిపిస్తోంది. అయితే, ఓటింగ్‌ నాటికి పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందిన గ్రామస్థులు.. టీడీపీ మద్దతురాలు బుసిరెడ్డి విజయలక్ష్మి, వైసీపీ మద్దతురాలు బుసిరెడ్డి మాధవి మధ్య సర్పంచ్‌ పదవి విషయమై ఏకగ్రీవానికి టాస్‌ వేశారు. వైసీపీ మద్దతురాలికి విజయం దక్కింది. కానీ మరో ఇద్దరు తమ నామినేషన్లను ఉపసంహరించుకోకపోవడంతో ఎన్నిక అనివార్యమైంది.

Updated Date - Nov 23 , 2026 | 05:53 AM