Share News

ప్రాణాలకు తెగించి.. బాలుడిని గెడ్డ దాటించి

ABN , Publish Date - Sep 24 , 2026 | 04:58 AM

జ్వరంతో బాధపడుతున్న బాలుడిని మేనమామ భుజంపై కూర్చోబెట్టుకొని ప్రాణాలకు తెగించి ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డను దాటించారు.

ప్రాణాలకు తెగించి.. బాలుడిని గెడ్డ దాటించి

జ్వరంతో బాధపడుతున్న బాలుడిని మేనమామ భుజంపై కూర్చోబెట్టుకొని ప్రాణాలకు తెగించి ఉధృతంగా ప్రవహిస్తున్న గెడ్డను దాటించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం ఓనుకొండలో బుధవారం జరిగిందీ ఘటన. గ్రామానికి చెందిన గెమ్మెల శాంతి మూడేళ్ల కుమారుడు రమేశ్‌కుమార్‌ జ్వరంతో బాధపడుతున్నాడు. అయితే, భారీవర్షాలకు ఓనుకొండ గెడ్డ ఉధృతంగా ప్రవహిస్తుండడంతో దీంతో బాలుడిని మేనమామ శ్రీరాములు భుజంపై కూర్చోబెట్టుకొని గెడ్డ దాటించి.. ఆపై ఆటోలో ఎస్‌.కోట ఆస్పత్రికి తీసుకెళ్లారు.

-ఆంధ్రజ్యోతి, అనంతగిరి

Updated Date - Sep 24 , 2026 | 04:58 AM