Share News

చంద్రబాబు కొత్త నాట కానికి తెరతీశారు

ABN , Publish Date - Oct 10 , 2026 | 05:40 AM

బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి, ఆచరణలో విఫలమై.. కొత్త నాటకానికి సీఎం చంద్రబాబు తెరతీశారని శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ ఆరోపించారు.

చంద్రబాబు కొత్త నాట కానికి తెరతీశారు

  • 34శాతం బీసీ రిజర్వేషన్‌ అమలు కాదని ముందే తెలుసు: బొత్స

విజయనగరం దాసన్నపేట అక్టోబరు 9(ఆంధ్రజ్యోతి): బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పి, ఆచరణలో విఫలమై.. కొత్త నాటకానికి సీఎం చంద్రబాబు తెరతీశారని శాసన మండలి ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ ఆరోపించారు. శుక్రవారం విజయనగ రం జిల్లాలో ఆయన మాట్లాడారు. ‘గతంలో సుప్రీం కోర్టు 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని తీర్పు ఇచ్చింది. దాన్ని విస్మరించి బీసీల కు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించారు. దీన్ని హైకోర్టు, సుప్రీంకోర్టులు తిరస్కరించాయి. బీసీలపై చిత్తశుద్ధి ఉంటే రాజ్యంగ సవరణ చేసి బీసీ రిజర్వేషన్‌ అమల్లోకి తీసుకురావచ్చు. చంద్రబాబుకు ఎన్నికలంటే భయం. ప్రభుత్వం పోలీసుస్టేషన్లను అడ్డుపెట్టుకున్నట్లే, న్యాయస్థానాలనూ అదుపులోకి తెచ్చుకోవాలని ప్రయత్నించటం పొరపాటు. మేం ఎన్నికలకు సిద్ధమవుతూ అభ్యర్థులను ఎంపిక చేసుకునే స్థితిలో ఉన్నాం. ఆలాంటిది మేం ఎన్నికలను ఎందుకు అడ్డుకుంటాం?’ అని బొత్స ప్రశ్నించారు.

ఈ వార్తలనూ చదవండి:

సుప్రీంకోర్టులో వైసీపీకి చుక్కెదురు..

ఏపీలో స్థానిక ఎన్నికల నగారా.! సుప్రీంకోర్టు కీలక తీర్పు

Updated Date - Oct 10 , 2026 | 05:40 AM