Share News

అరకు ఘాట్ రోడ్డు లోయలో బోల్తా పడిన బొలెరో వాహనం.. 10 మందికి గాయాలు

ABN , Publish Date - Mar 13 , 2026 | 09:42 PM

అరకు ఘాట్ రోడ్డులో బొలెరో వాహనం లోయలోకి బోల్తా కొట్టింది. అనంతగిరి మండలం తుమ్మనవలస దగ్గర ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో సుమారు 30 మంది కార్మికులు ఉండగా, 10 మందికి గాయాలయ్యాయి. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది.

అరకు ఘాట్ రోడ్డు లోయలో బోల్తా పడిన బొలెరో వాహనం.. 10 మందికి గాయాలు
Araku Valley accident

అరకులోయ, ఫిబ్రవరి 13: ఆంధ్రప్రదేశ్ లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం జరిగింది. కార్మికులతో వెళ్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి లోయలోకి బోల్తా పడింది. ఈ ఘటనలో సుమారు 10 మంది వరకు గాయపడగా, వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ప్రమాదం ఎలా జరిగిందంటే..

అరకులోయ మండలం, అనంతగిరి సమీపంలోని తుమ్మనవలస ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బొలెరో వాహనంలో సుమారు 30 మంది కార్మికులు ప్రయాణిస్తున్నారు. వీరంతా రైల్వే పనుల కోసం వెళ్తున్నట్లు ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తోంది. అరకు నుండి ఎస్.కోట వైపు వెళ్తుండగా, మార్గమధ్యంలో వాహనం అదుపుతప్పి లోయలోకి పడిపోయింది.


క్షతగాత్రుల పరిస్థితి:

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, అత్యవసర వైద్య బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం వెంటనే ఎస్.కోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

మిడిల్‌ఈస్ట్‌లో హింసకు స్వస్తి పలకండి: ఇరాన్ అధ్యక్షుడు మసౌద్‌తో మోదీ

తమిళనాడు రాజకీయాల్లో కొత్త పార్టీ.. శశికళ సంచలన ప్రకటన

Updated Date - Mar 13 , 2026 | 09:48 PM