Share News

ONGCs Blowout Intensity: ఇరుసుమండలో తగ్గిన బ్లో అవుట్ తీవ్రత

ABN , Publish Date - Jan 07 , 2026 | 09:02 AM

కోనసీమ జిల్లా ఇరుసుమండలో బుధవారం నాటికి బ్లో అవుట్ తీవ్రత తగ్గింది. అగ్నికీలలపై 3 వైపుల నుంచి తీవ్ర ఒత్తిడితో కూడిన వాటర్‌ అంబ్రెల్లా ప్రక్రియతో నీటిని వెదజల్లుతుండడంతో మంటలు కొద్దికొద్దిగా అదుపులోకి వస్తున్నాయి.

ONGCs Blowout Intensity: ఇరుసుమండలో తగ్గిన బ్లో అవుట్ తీవ్రత
ONGCs Blowout Intensity

కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలోని ఓఎన్జీసీ సైట్‌ నుంచి భారీగా మంటలు ఎగసిపడుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజులు అవుతున్నా మంటలు ఆగటం లేదు. కానీ, బుధవారం నాటికి బ్లో అవుట్ తీవ్రత తగ్గింది. అగ్నికీలలపై 3 వైపుల నుంచి తీవ్ర ఒత్తిడితో కూడిన వాటర్‌ అంబ్రెల్లా ప్రక్రియతో నీటిని వెదజల్లుతుండడంతో మంటలు కొద్దికొద్దిగా అదుపులోకి వస్తున్నాయి. మంటలు నియంత్రించేందుకు వారం రోజుల సమయం పడుతుందని కలెక్టర్ మహేష్‌కుమార్ తెలిపారు. బ్లో అవుట్ వల్ల ఎలాంటి ముప్పు లేదని ONGC డైరెక్టర్ విక్రమ్ సక్సేనా వెల్లడించారు.


అధికారులు ఇరుసుమండలో విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. గ్రామస్తులు పునరావాస కేంద్రాల నుంచి గృహాలకు చేరుకుంటున్నారు. ఇరుసుమండలో పాఠశాలలు కూడా మళ్లీ తెరుచుకున్నాయి. బ్లో అవుట్‌కు కారణమైన డీప్ ఇండస్ట్రీస్ నిర్లక్ష్యంపై విచారణ జరపాలని ఎంపీ హరీష్ మాదుర్ కోరారు. ONGC డ్రిల్లింగ్ చేసే ప్రతి సైట్‌ వివరాలు ప్రజలకు తెలియజేయాలని ఎంపీ, ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. పాత గ్యాస్ పైపులైన్లు మార్చాలని కూడా కోరుతున్నారు.


ఇవి కూడా చదవండి

ఈ సుమిత్ర లేడీకాదు.. కిలాడీ.. ఏం చేసిందంటే..

సన్‌స్క్రీన్ అప్లై చేసిన తర్వాత కూడా చర్మం నల్లగా మారుతోందా?

Updated Date - Jan 07 , 2026 | 10:55 AM